పాతబస్తీలో దారుణం.. తల్వార్లతో దాడి

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ ఏరియాలో బుధవారం భయానక ఘటన చోటుచేసుకుంది. పార్కింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ పెద్ద వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే కత్తులు, తల్వార్లు, బండరాళ్లతో ఓ వర్గం మరో వ్యక్తి కుటుంబంపై దాడికి పాల్పడింది. కుల్సుంపుర పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దుండగుల దాడిలో బాధిత వ్యక్తి ఇంట్లోని వస్తువులన్నీ చెల్లా చెదురయ్యాయి. ఒక్కసారిగా దాడి జరగడంతో స్థానికులు భయాందోళనకు […]

Update: 2020-09-02 00:39 GMT
పాతబస్తీలో దారుణం.. తల్వార్లతో దాడి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ ఏరియాలో బుధవారం భయానక ఘటన చోటుచేసుకుంది. పార్కింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ పెద్ద వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే కత్తులు, తల్వార్లు, బండరాళ్లతో ఓ వర్గం మరో వ్యక్తి కుటుంబంపై దాడికి పాల్పడింది.

కుల్సుంపుర పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దుండగుల దాడిలో బాధిత వ్యక్తి ఇంట్లోని వస్తువులన్నీ చెల్లా చెదురయ్యాయి. ఒక్కసారిగా దాడి జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News