కంటి మందులో ఎలాంటి విషం లేదు : ఆనందయ్య
దిశ, ఏపీ బ్యూరో: కంటి ముందుపై ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 16ఏళ్లుగా కంటి ముందు వేస్తున్నానని దాని వల్ల ఎవరికీ ఇబ్బంది కలుగలేదని స్పష్టం చేశారు. కంటిలో వేసే చుక్కల మందులో హానికర పదార్థం ఉందంటూ హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది ఆరోపించడాన్ని ఖండించారు. అందులో విషం లేదన్నారు. విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎవరికి కంటి చూపు దెబ్బ తినలేదని.. ఎవరికైనా ఇబ్బంది కలిగిందని చెప్తే తాను […]
దిశ, ఏపీ బ్యూరో: కంటి ముందుపై ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 16ఏళ్లుగా కంటి ముందు వేస్తున్నానని దాని వల్ల ఎవరికీ ఇబ్బంది కలుగలేదని స్పష్టం చేశారు. కంటిలో వేసే చుక్కల మందులో హానికర పదార్థం ఉందంటూ హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది ఆరోపించడాన్ని ఖండించారు. అందులో విషం లేదన్నారు. విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎవరికి కంటి చూపు దెబ్బ తినలేదని.. ఎవరికైనా ఇబ్బంది కలిగిందని చెప్తే తాను మందు ఇవ్వడం ఆపేస్తానని స్పష్టం చేశారు.
కంటిలో చుక్కల మందు పంపిణీకి హైకోర్టు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. ప్రజలే ఇబ్బందిపడతారని ఆనందయ్య వెల్లడించారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో ఆనందయ్య ముందు అమ్ముకుంటున్నారని కోర్టులో వేసిన కేసుపై కూడా ఆనందయ్య స్పందించారు. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి తన దగ్గరకు వస్తే ఉచితంగా ఇస్తున్నానని.. ప్రతి జిల్లాలో ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అమ్ముకుంటున్నారంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన పేరు చెప్పుకొని ఎవరైనా అమ్ముకుంటున్నారేమో అని ఆరోపించారు. అలాంటి వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆనందయ్య డిమాండ్ చేశారు.