అయ్యా, కొడుకుల నడుమ ఏకాభిప్రాయమే లేదు : రేవంత్
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలువదని అయ్యా, కొడుకులు ఇద్దరూ చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. అయ్యా, కొడుకుల మధ్య దీనిపై ఒక అభిప్రాయం లేదన్నారు. టీఆర్ఎస్ మీటింగ్‌కు సీనియర్లు రాలేదని, కేవలం కేటీఆర్ మాత్రమే వచ్చారన్నారు. టీఆర్ఎస్ నేతలే కేసీఆర్‌ను నమ్మడం లేదని తెలిసిపోతుందన్నారు. టీఆర్ఎస్ నాయకులను చీల్చి చింతకు కట్టాలే.. మోసానికి ప్రతీక కేసీఆర్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూల్చి కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లేందుకు […]
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలువదని అయ్యా, కొడుకులు ఇద్దరూ చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. అయ్యా, కొడుకుల మధ్య దీనిపై ఒక అభిప్రాయం లేదన్నారు. టీఆర్ఎస్ మీటింగ్‌కు సీనియర్లు రాలేదని, కేవలం కేటీఆర్ మాత్రమే వచ్చారన్నారు. టీఆర్ఎస్ నేతలే కేసీఆర్‌ను నమ్మడం లేదని తెలిసిపోతుందన్నారు.
టీఆర్ఎస్ నాయకులను చీల్చి చింతకు కట్టాలే..
మోసానికి ప్రతీక కేసీఆర్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూల్చి కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లేందుకు రోడ్లను వేశారని మూడు చింతపల్లి దళితులు ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇందిరమ్మ హయాంలో 50 ఎకరాల భూమిని దళితులకు ఇచ్చారని, కొత్త పాసు పుస్తకాలు ఇస్తామని ఇటీవల తహసీల్దార్ తమ పత్రాలు పట్టుకుపోయారని దళితులు చెప్పారన్నారు. అప్పటి నుంచి ఈ బాధితులకు రైతుబంధు రావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే దళితులను దగా చేస్తుందన్నారు. టీఆర్ఎస్ నాయకులను మూడు చింతలపల్లిలో చీల్చి చింతకు కట్టాలనుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ వాళ్లను తరిమికొట్టుతామన్నారు.