చిలిపి దొంగ.. ఓనర్ కాల్ చేస్తే పాస్‌వర్డ్ అడిగాడు.. ఎందుకో తెలుసా..!

దిశ, పటాన్‌చెరు : పటాన్‌చెరు పట్టణం శాంతినగర్ కాలనీలో నివాసముంటున్న బాలకృష్ణ అనే వ్యక్తి ఇంటిలో బుధవారం ఉదయం సుమారు 3 గంటల సమయంలో ఓ చిల్లర దొంగ వచ్చి హల్‌చల్ సృష్టించాడు. ఎంత వెతికినా బంగారం కనిపించకపోవడంతో అక్కడున్న ఫొన్లలో దొంగిలించుకుని వెళ్లాడు. తెల్లవారు జామున ఇంట్లో చూసేసరికి ఫొన్లు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అర్ధరాత్రి సమయంలో దొంగ ఇంట్లో అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. దొంగిలించిన సెల్‌ఫొన్ నెంబర్‌‌కు […]

Update: 2021-08-19 10:10 GMT

దిశ, పటాన్‌చెరు : పటాన్‌చెరు పట్టణం శాంతినగర్ కాలనీలో నివాసముంటున్న బాలకృష్ణ అనే వ్యక్తి ఇంటిలో బుధవారం ఉదయం సుమారు 3 గంటల సమయంలో ఓ చిల్లర దొంగ వచ్చి హల్‌చల్ సృష్టించాడు. ఎంత వెతికినా బంగారం కనిపించకపోవడంతో అక్కడున్న ఫొన్లలో దొంగిలించుకుని వెళ్లాడు. తెల్లవారు జామున ఇంట్లో చూసేసరికి ఫొన్లు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అర్ధరాత్రి సమయంలో దొంగ ఇంట్లో అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. దొంగిలించిన సెల్‌ఫొన్ నెంబర్‌‌కు బాధితుడు కాల్ చేసి అందులో కార్యాలయాలకు సంబంధించిన సమాచారం ఉందని, వాటిని తిరిగి ఇవ్వాలని కోరాడు.

వీలైతే మీకు ఏమైనా అవసరాలకు సహాయం చేస్తామని చెప్పగా.. ఫొన్లు దొంగిలించిన వ్యక్తి నేను బంగారం కోసం వచ్చాను. దొరకకపోవడంతో అక్కడున్న సెల్ ఫొన్లు దొంగిలించుకుని వెళ్లిపోయానని చెప్పాడు. అంతేకాకుండా, నాకు బోర్ కొడుతుందని, ఫొన్ పాస్వర్డ్ చెప్తే చార్జింగ్ అయిపోయే వరకూ గేమ్ ఆడుకుని కాలక్షేపం చేస్తానని అన్నాడు. అనంతరం పటాన్‌చెరు తీసుకొచ్చి మొబైల్స్ ఇచ్చేస్తానని తెలిపాడు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి రావడంతో పోలీసులు మీసేవ ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పడంతో చివరకు బాధితుడు మీ సేవ కేంద్రంలో ఫిర్యాదు చేశాడు.

Tags:    

Similar News