లాక్‌డౌన్ టైమ్.. గతేడాది ఆశీర్వాద్ గోధుమ పిండి.. ఈసారి రీజన్ ఏంటో తెలుసా.?
దిశ, కుత్బుల్లాపూర్ : గత ఏడాది లాక్‌డౌన్‌లో గోధుమ పిండి కోసం పది కిలో మీటర్ల దూరం వెళ్లానని, వదిలిపెట్టాలని పోలీసులతో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగిన విషయం ఎప్పటికీ గుర్తుండి పోతుంది. అయితే, అలాంటి ఘటనే ఆదివారం కుత్బుల్లాపూర్ సర్కిల్ షాపూర్ నగర్‌లో వెలుగులోకి వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో షాపూర్ నగర్‌లో రాము అనే యువకుడు సాగర్ హోటల్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. ఈ సందర్భంగా పోలీసులు రామును ఎక్కడికి వెళ్లావని, సమయం […]
దిశ, కుత్బుల్లాపూర్ : గత ఏడాది లాక్‌డౌన్‌లో గోధుమ పిండి కోసం పది కిలో మీటర్ల దూరం వెళ్లానని, వదిలిపెట్టాలని పోలీసులతో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగిన విషయం ఎప్పటికీ గుర్తుండి పోతుంది. అయితే, అలాంటి ఘటనే ఆదివారం కుత్బుల్లాపూర్ సర్కిల్ షాపూర్ నగర్‌లో వెలుగులోకి వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో షాపూర్ నగర్‌లో రాము అనే యువకుడు సాగర్ హోటల్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు.
ఈ సందర్భంగా పోలీసులు రామును ఎక్కడికి వెళ్లావని, సమయం దాటిన తర్వాత ఎందుకు బయట తిరుగుతున్నావని ప్రశ్నించారు. దీంతో అతడు.. స్కూటీ డిక్కీలోంచి ఓ పాల బాటిల్ తీసి చూపించాడు. బాలానగర్‌లో పాలు తీసుకువస్తున్నానని చెప్పడంతో స్థానికులు నవ్వుకున్నారు. అయితే పాలకోసమే వెళ్లాడు కదా.. అని పోలీసులు అతడిని వదిలిపెట్టారు. మరోసారి ఇలా పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏమైనా పనుల కోసం వెళ్లి పాల డబ్బాను సాకుగా చూపుతున్నాడా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.