విషాదం.. అధికారి నిర్లక్ష్యం.. క్రషర్ మిల్లులో పడి యువకుడు మృతి
దిశ, మణుగూరు : భద్రాద్రి పవర్ ప్లాంట్ క్రషర్ మిల్లులో పడి బుస్సి శివకుమార్ అనే యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సిస్కాన్ కంపెనీ క్రషర్ మిల్లులో శివ పని చేస్తుండగా, సూపర్‌వైజర్ క్రషర్ మిల్లును ఆన్ చేయడంతో శివ.. క్రషర్ మిల్లులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల ప్రకారం.. పినపాక మండలం గోపాలరావు పేట గ్రామానికి చెందిన బుస్సి శివకుమార్(24) భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో రోజూ వారీ కూలిగా పని చేస్తున్నాడు. […]
దిశ, మణుగూరు : భద్రాద్రి పవర్ ప్లాంట్ క్రషర్ మిల్లులో పడి బుస్సి శివకుమార్ అనే యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సిస్కాన్ కంపెనీ క్రషర్ మిల్లులో శివ పని చేస్తుండగా, సూపర్‌వైజర్ క్రషర్ మిల్లును ఆన్ చేయడంతో శివ.. క్రషర్ మిల్లులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల ప్రకారం.. పినపాక మండలం గోపాలరావు పేట గ్రామానికి చెందిన బుస్సి శివకుమార్(24) భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో రోజూ వారీ కూలిగా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం క్రషర్ మిల్లులో పని చేయడానికి వెళ్ళాడు. అయితే క్రషర్ వద్దకు శివ వెళ్లిన సమాచారం తెలుసుకోకుండా సూపర్‌వైజర్ క్రషర్ మిల్లును ఆన్ చేయడంతో.. శివ మిల్లులో పడి దుర్మరణం చెందాడు. అనంతరం కంపెనీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలియకుండా శివకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. విషయం తెలుసుకున్న కార్మికులు ఆగ్రహంలో.. సిస్కాన్ కంపెనీ హెచ్.ఆర్ అధికారి లక్ష్మణ్‌ను చితకబాదారు.
శివ మృతి వార్త విన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన పవర్ ప్లాంట్‌కు చేరుకున్నారు. అక్కడ శివ డెడ్ బాడీ లేకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న మణుగూరు పోలీస్ సీఐ భాను ప్రకాష్.. సిబ్బందితో కలిసి హుటాహుటిన పవర్ ప్లాంట్‌కు చేరుకున్నారు. కార్మికులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని శాంతింజేశారు. ఈ క్రమంలో శివ మృతదేహాన్ని చూపించాలని కుటుంబ సభ్యులు, కార్మికులు డిమాండ్ చేయడంతో 108 సిబ్బంది మృతదేహన్ని తిరిగి తీసుకొని వచ్చారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని పవర్ ప్లాంట్ గేటు ఎదురుగా కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. శివ మరణానికి గల కారణాలు తెలుసుకొని, విచారణ నిర్వహిస్తామని తెలిపారు.