హ్యాట్సాఫ్… కాలువలో పడిన యువకులు.. చీరతో కాపాడిన మహిళ
దిశ, కల్లూరు: కల్లూరు మండల పరిధిలోని రఘునాథ గూడెం గ్రామంలో శనివారం అర్థరాత్రి వరకు జరిగిన బతుకమ్మ నిమజ్జనం వేడుకల్లో కాలువలో కొట్టుకుపోతున్న ముగ్గురు యువకులను ఒక మహిళ తన ఒంటి మీద చీరతో రక్షించింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నిమజ్జనోత్సవం సందర్భంగా సుమారు 200 మంది ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం ఊరు దగ్గరలో ఉన్న యన్ యస్ పి మధిర బ్రాంచ్ కాలువలో నిమజ్జనం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు మధులత అనే మహిళ గల్లంతయింది. అది […]
దిశ, కల్లూరు: కల్లూరు మండల పరిధిలోని రఘునాథ గూడెం గ్రామంలో శనివారం అర్థరాత్రి వరకు జరిగిన బతుకమ్మ నిమజ్జనం వేడుకల్లో కాలువలో కొట్టుకుపోతున్న ముగ్గురు యువకులను ఒక మహిళ తన ఒంటి మీద చీరతో రక్షించింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నిమజ్జనోత్సవం సందర్భంగా సుమారు 200 మంది ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం ఊరు దగ్గరలో ఉన్న యన్ యస్ పి మధిర బ్రాంచ్ కాలువలో నిమజ్జనం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు మధులత అనే మహిళ గల్లంతయింది. అది గ్రహించిన పదిమంది యువకులు ఆమెను రక్షించే ప్రయత్నంలో కాలువలో దూకారు. ఈ నేపథ్యంలోనే పసుపులేటి శివ అనే యువకుడు కూడా గల్లంతయ్యాడు.
మిగతా ఆరుగురు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అతి కష్టం మీద పైకి ఎక్కినప్పటికీ.. మిగిలిన ముగ్గురి పరిస్థితి గందరగోళంగా కనిపించడంతో అక్కడే ఉన్న ఖమ్మంపాటి సంపూర్ణ అనే మహిళ సమయస్ఫూర్తితో యువకులను కాపాడేందుకు తన ఒంటిపై ఉన్న చీరను తీసి ప్రమాదంలో ఉన్న వారిని కాపాడింది. ఆమెకు ప్రక్కనే ఉన్న పోనుగుమాటి శ్రీనివాసరావు సహాయంగా అందించాడు. దీంతో చీర సహాయంతో ముగ్గురు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటన స్థలంలో ఉన్న ఉప సర్పంచ్ చల్లగుండ్ల వెంకటేశ్వరరావు ఆమెను అభినందించారు. గ్రామస్తులు, మండల ప్రజలు ఆమెను అభినందిస్తున్నారు.