వీఆర్వోల పదోన్నతులపై స్పష్టత ఇవ్వండి: ఉపేంద్రరావు

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖలో అనేక సంవత్సరాలు ప్రభుత్వ విధులు నిర్వహించాం. ఎలాంటి పదోన్నతులకు నోచుకోకుండా 20ఏండ్లు పని చేశాం. ఒకే క్యాడర్ లో విధులు నిర్వహించిన వారికి కూడా అ పదోన్నతులు నోచుకోక నట్టుబారిపోయినం.. ఎదుగూబొదుగు లేని ఉద్యోగ జీవితంలో వీఆర్వోలు ఉన్నారని తెలంగాణ వీఆర్వో సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హారాలే సుధాకర్ రావు, రాష్ట్ర కోశాధికారి కోనబోయిన ప్రసాద్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం […]

Update: 2021-01-05 11:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖలో అనేక సంవత్సరాలు ప్రభుత్వ విధులు నిర్వహించాం. ఎలాంటి పదోన్నతులకు నోచుకోకుండా 20ఏండ్లు పని చేశాం. ఒకే క్యాడర్ లో విధులు నిర్వహించిన వారికి కూడా అ పదోన్నతులు నోచుకోక నట్టుబారిపోయినం.. ఎదుగూబొదుగు లేని ఉద్యోగ జీవితంలో వీఆర్వోలు ఉన్నారని తెలంగాణ వీఆర్వో సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హారాలే సుధాకర్ రావు, రాష్ట్ర కోశాధికారి కోనబోయిన ప్రసాద్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వారు మీడియాకు విడుదల ప్రకటనను విడుదల చేశారు. 8దశాబ్దాలుగా రెవెన్యూ శాఖలో అశాస్త్రీయమైన పని విధానంతో పేరుకు పోయిన భూ సంబంధ, ప్రజా సంబంధమైన సమస్యల పరిష్కారం కేవలం సమగ్ర భూ సర్వే మాత్రమేనన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా విశిష్ట సేవలు అందిస్తున్న వీఆర్వోలపై అవినీతి నెపంతో రద్దు చేయడం ప్రజల ఆలోచనలను తప్పు దారి పట్టించటమేనన్నారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దు విషయంలో సంఘాలతో చర్చించాల్సిన ప్రభుత్వం, ఇతర సంఘాలతో చర్చించి వారి అనుమతితోనే రద్దుచేశామనడం బాధ్యతారాహిత్యమని ఆరోపించారు, పదోన్నతుల విషయంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సీఎం, ప్రధాన కార్యదర్శిలను కోరారు. గత సర్వీసుకు భంగం కలగకుండా రెవెన్యూ శాఖలో వీఆర్వోలను రీలోకేట్​ చేయాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

Tags:    

Similar News