మంచి పని చేశారు – భారత్‌కు అమెరికా చట్టసభ్యుల ప్రశంసలు
న్యూయార్క్ : భారత్‌లో 5 జీ ట్రయల్స్ కోసం చైనా కంపెనీలకు అనుమతి నిరాకరించినందుకు భారత్‌పై పలువురు అమెరికా చట్టసభ్యులు ప్రశంసలు కురిపించారు. 5 జీ ట్రయల్స్ నుంచి చైనాను తప్పించి భారత్ మంచి పని చేసిందని కొనియాడారు. ఈ నిర్ణయం భారత్‌తో పాటు ప్రపంచానికీ ఎంతో క్షేమకరమని తెలిపారు. ఇదే విషయమై యూఎస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ చీఫ్, రిపబ్లికన్ అండ్ చైనా టాస్క్‌ఫోర్స్ చైర్మెన్ మైఖేల్ మెక్‌కాల్ మాట్లాడుతూ.. ‘5 జీ ట్రయల్స్ నుంచి […]
న్యూయార్క్ : భారత్‌లో 5 జీ ట్రయల్స్ కోసం చైనా కంపెనీలకు అనుమతి నిరాకరించినందుకు భారత్‌పై పలువురు అమెరికా చట్టసభ్యులు ప్రశంసలు కురిపించారు. 5 జీ ట్రయల్స్ నుంచి చైనాను తప్పించి భారత్ మంచి పని చేసిందని కొనియాడారు. ఈ నిర్ణయం భారత్‌తో పాటు ప్రపంచానికీ ఎంతో క్షేమకరమని తెలిపారు. ఇదే విషయమై యూఎస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ చీఫ్, రిపబ్లికన్ అండ్ చైనా టాస్క్‌ఫోర్స్ చైర్మెన్ మైఖేల్ మెక్‌కాల్ మాట్లాడుతూ.. ‘5 జీ ట్రయల్స్ నుంచి చైనా సంస్థలు హువాయ్, జెడ్‌టీఈ ని తప్పించడం భారత్‌కే గాక ప్రపంచానికి ఎంతో మంచివార్త..’ అని అన్నారు. తమ (అమెరికా) మిత్ర దేశాలు కూడా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా తయారుచేసిన టెక్నాలజీని వాడొద్దని సూచించారు. యూఎస్ కాంగ్రెస్ లా మేకర్ మైక్ వాల్ట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా హువాయ్, జెడ్‌టీఈలు జాతీయ భద్రతకు ముప్పు అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.