కరోనాకు ఇస్తున్న ట్రీట్‌మెంట్ ఇదే!

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్ 19 వైరస్ ఇంతమందికి సోకింది, అంత మందికి సోకింది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. వాళ్లందరినీ బలవంతంగా ఐసోలేట్ కూడా చేస్తున్నారు. ఆ ఐసోలేషన్ భరించలేక పారిపోతున్న వాళ్లు కూడా ఉన్నారు. కొంతమందికి ట్రీట్‌మెంట్ చేస్తున్నాం.. తగ్గిపోయిందంటూ డిశ్చార్జి చేస్తున్నారు. అయితే ఓ వైపు కరోనాకు ఇంకా మందు కనిపెట్టలేదు అంటున్నారు.. మరోవైపు తగ్గిందంటూ డిశ్చార్జి చేస్తున్నారు.. ఇదెలా సాధ్యమంటూ సాధారణ ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే భయంతో ఉన్న వారు కరోనా […]

Update: 2020-03-10 00:44 GMT

దిశ, వెబ్‌డెస్క్:
కోవిడ్ 19 వైరస్ ఇంతమందికి సోకింది, అంత మందికి సోకింది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. వాళ్లందరినీ బలవంతంగా ఐసోలేట్ కూడా చేస్తున్నారు. ఆ ఐసోలేషన్ భరించలేక పారిపోతున్న వాళ్లు కూడా ఉన్నారు. కొంతమందికి ట్రీట్‌మెంట్ చేస్తున్నాం.. తగ్గిపోయిందంటూ డిశ్చార్జి చేస్తున్నారు. అయితే ఓ వైపు కరోనాకు ఇంకా మందు కనిపెట్టలేదు అంటున్నారు.. మరోవైపు తగ్గిందంటూ డిశ్చార్జి చేస్తున్నారు.. ఇదెలా సాధ్యమంటూ సాధారణ ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే భయంతో ఉన్న వారు కరోనా ఉందా పోయిందా అని అర్థంకాక సతమతమవుతున్నారు.

నిజానికి అధికారిక రికార్డుల ప్రకారం కరోనా వైరస్ సోకితే ప్రత్యేక ట్రీట్‌మెంట్ అంటూ ఏదీ లేదు. అయితే వైరస్ సోకిన వారిని ఐసోలేట్ చేయడం ద్వారా ఎక్కువ మంది వ్యాధి బారిన పడకుండా అడ్డుకుంటున్నారు. శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి కరోనాతో పోరాడటానికి సరిపోతుంది. దీంతో ఐసోలేషన్‌లో ఉన్న వారికి వ్యాధి నిరోధక శక్తి పెంచే మందులు మాత్రం ఇస్తున్నారు. కరోనా సోకిన వారిలో కేవలం మూడు శాతం మాత్రమే మరణ రేటు ఉంది. అది కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు మాత్రమే.

వైరస్ కారణంగా జ్వరం వస్తే పారాసెటమోల్ ఇస్తున్నారు. ఇక తలనొప్పి, దగ్గు తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు. వీలైనంత వరకు వైరస్ సోకిన వారిని హైడ్రేటేడ్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి వైరస్‌ను అడ్డుకోగల సామర్థ్యం పెరుగుతుంది. అయితే తీవ్ర పరిస్థితుల్లో మాత్రం హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు ఉపశమనం కోసం వాడే లోపినవిర్, రిటోనవిర్ మందుల సమ్మేళనం ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ మందులు ఉపయోగించడం వల్ల వేరే సైడ్ ఎఫెక్టులు ఉన్న కారణంగా ఇప్పటి వరకు వీటిని వాడలేదు. కాబట్టి వ్యాధి వచ్చాక ట్రీట్‌మెంట్ తీసుకోవడం కంటే వ్యాధి రాకముందు నివారణ చర్యలు తీసుకోవడమే మంచిది.

Tags: Corona, Virus, COVID 19, cough, fever, Treatment, paracetamol

Tags:    

Similar News