రేవంత్ పుట్టింది రెడ్డి సామాజిక వర్గంలో అయినా…
దిశ, కంటోన్మెంట్: బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న అందించిన సేవలు అమోఘమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370 ఏండ్ల క్రితమే నాటి రాజులు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు అన్నారు. పాపన్న గౌడ్ చరిత్రను బ్రిటిష్ […]
దిశ, కంటోన్మెంట్: బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న అందించిన సేవలు అమోఘమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370 ఏండ్ల క్రితమే నాటి రాజులు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు అన్నారు.
పాపన్న గౌడ్ చరిత్రను బ్రిటిష్ వాళ్లు లండన్‌లో యూనివర్సిటీలో భద్రపరచి, ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించారని తెలిపారు. అదే తరహాలో రాష్ట్రంలో పాపన్న గౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవిస్తున్నామని తెలిపారు. బోయిన్‌పల్లిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో నిర్వాహకులను మంత్రి అభినందించారు.
అనంతరం మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ…
కాంగ్రెస్ నేత, మాల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పుట్టింది రెడ్డి సామాజిక వర్గంలో అయినా, బడుగు వర్గాలకు చేతిలో కర్రగా మారాడని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే వ్యక్తులను మనం గుర్తించాలని, వారికి అండగా నిలబడాలన్నారు. తెల్ల బట్టల వారికి మనం అమ్ముడు పోవొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.