సొంత నిధులతో స్కూల్‌కు రంగులు

దిశ, కుత్బుల్లాపూర్: ప్రభుత్వ పాఠశాల అంటే అరకొర వసతులు.. అపరిశుభ్ర వాతావరణం.. కనీస మౌలికసతులు కరువు.. శిథిలావస్థకు చేరిన భవనాలు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ, అందుకు భిన్నంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనిపిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రంగులతో మెరిసిపోయే భవనం.. విద్యార్థులకు సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురుచూడలేదు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులే సొంత నిధులతో […]

Update: 2021-02-05 20:31 GMT

దిశ, కుత్బుల్లాపూర్: ప్రభుత్వ పాఠశాల అంటే అరకొర వసతులు.. అపరిశుభ్ర వాతావరణం.. కనీస మౌలికసతులు కరువు.. శిథిలావస్థకు చేరిన భవనాలు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ, అందుకు భిన్నంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనిపిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రంగులతో మెరిసిపోయే భవనం.. విద్యార్థులకు సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురుచూడలేదు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులే సొంత నిధులతో స్కూల్​భవనానికి రంగులు వేయించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం రంగులు వెలిసిపోయి పాడుబడిన భవనం కన్పించేది. అయితే లాక్ డౌన్ సమయంలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణా రెడ్డి చొరవతో ప్రతీ ఉపాధ్యాయుడు రంగులు వేయించేందుకు ముందుకు వ చ్చారు. ఇలా అందరు కలిసి సుమారు రూ.40 వేలతో ఏ ప్రభుత్వ పాఠశాలకు లేని విధంగా రంగులు వేయించారు. అంతటితో ఆగకుండా ప్రతి ఉపాధ్యాయుడు ఒక మహనీయుడి బొమ్మ ను గోడలపై వేయించారు. విద్యార్థులను చైతన్యపర్చేందుకు గోడలపై సూక్తులు రాయించారు. ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చేసిన పనికి ప్రతీ ఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు.

ప్రైవేట్‌కు ధీటుగా

కొందరు ప్రైవేట్ పాఠశాలల్లోనే మం చి చదువని భ్రమపడుతున్నారు. కానీ, ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఉత్తమ వి ద్యనందించేలా సహకరిస్తుంది. మా పా ఠశాలను ప్రైవేట్ కు దీటు గా తయారు చేశాం.

–రామకృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు

మాలాగా బాధపడొద్దని..

మా చిన్నప్పుడు అరకొర వసతులతో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకున్నాం. మేము పడిన ఇ బ్బందులు ఇప్పటి పిల్లలు పడొద్దని అనుకున్నాం. పిల్లల్లో నమ్మ కం కలిగించేలా స్కూల్​ ను మారు స్తున్నాం.

–ఆశారాణి, ఉపాధ్యాయురాలు

Tags:    

Similar News