ముఖ్యమంత్రి వస్తే మమ్మల్ని ఆహ్వానించరా?

దిశ ప్రతినిధి, మెదక్: సీఎం వస్తుంది మా మండలానికి అని, వారం రోజులుగా రాత్రింబవళ్లు కష్టపడ్డాం. తీనా ముఖ్యమంత్రి వచ్చాక మాకు పాసులు ఇవ్వలేదని కొండపాక మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ జేజేలు కొట్టించుకుంటారు. కానీ, మా మండలంలో కేసీఆర్ మీటింగ్‌ పెడితే మమ్మల్నే అనుమతించడం లేదని మండిపడుతున్నారు. ఏమైనా అంటే ప్రోటోకాల్ అని చెబుతున్నారని, ఈ […]

Update: 2021-06-20 02:33 GMT
chief minister kcr
  • whatsapp icon

దిశ ప్రతినిధి, మెదక్: సీఎం వస్తుంది మా మండలానికి అని, వారం రోజులుగా రాత్రింబవళ్లు కష్టపడ్డాం. తీనా ముఖ్యమంత్రి వచ్చాక మాకు పాసులు ఇవ్వలేదని కొండపాక మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ జేజేలు కొట్టించుకుంటారు. కానీ, మా మండలంలో కేసీఆర్ మీటింగ్‌ పెడితే మమ్మల్నే అనుమతించడం లేదని మండిపడుతున్నారు. ఏమైనా అంటే ప్రోటోకాల్ అని చెబుతున్నారని, ఈ విషయంపై మండల ఎంపీపీ, జెడ్పీటీసీలు స్పందించాలని డిమాండ్ చేశారు. మరికొందరు నాయకులు స్పందిస్తూ… పక్క మండలంలోని నాయకులకు, ప్రజాప్రతినిధులకు అనుమతించి, సొంత మండల నాయకులకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వారికి సీఎం ప్రోటోకాల్ వర్తించదా? అంటూ కాస్త ఘాటుగానే విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News