గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు బాధ్యత మీదే : హరీశ్ రావు
దిశ, పటాన్ చెరు: బూత్ ఇంచార్జీలు సమన్వయంతో పని చేసి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ప్రతి పక్షాల దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని ఆయన కోరారు. రామచంద్రాపురం, పటాన్ చెరు డివిజన్ల బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఆయన బూత్ ఇంచార్జిలు, ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. స్థానిక ఇంచార్జ్‌లు […]
దిశ, పటాన్ చెరు: బూత్ ఇంచార్జీలు సమన్వయంతో పని చేసి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ప్రతి పక్షాల దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని ఆయన కోరారు. రామచంద్రాపురం, పటాన్ చెరు డివిజన్ల బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఆయన బూత్ ఇంచార్జిలు, ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. స్థానిక ఇంచార్జ్‌లు నాయకుల వెంట తిరగకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇంచార్జిలతో కలిసి బూత్‌లలో అందుబాటులో ఉండి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా, పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.