ఆ ప్రాజెక్టుల నీళ్లుండే.. ప్రారంభం ఎల్లుండే!

దిశ, మెదక్: శ్రీరంగనాయక సాగర్ ప్రాజెక్టును సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే రంగనాయక సాగర్ సర్జిపూల్‌కు అనంతగిరి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు వచ్చి చేరుకున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం సర్జిపూల్ లోని నాలుగు మోటార్ల వైట్ రన్ పూర్తి చేసింది. రంగనాయక సాగర్ ప్రారంభం ఏర్పాట్లు మంత్రి హరీశ్ రావు పర్యవేక్షించారు. రంగనాయక సాగర్ కుడి కాలువ వెంట శనివారం మంత్రి హరీష్ రావు పర్యటించారు. రైతులు కాలువ వెంట తమ పొలాలకు పిల్లకాలువలు […]

Update: 2020-04-18 08:12 GMT

దిశ, మెదక్: శ్రీరంగనాయక సాగర్ ప్రాజెక్టును సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే రంగనాయక సాగర్ సర్జిపూల్‌కు అనంతగిరి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు వచ్చి చేరుకున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం సర్జిపూల్ లోని నాలుగు మోటార్ల వైట్ రన్ పూర్తి చేసింది. రంగనాయక సాగర్ ప్రారంభం ఏర్పాట్లు మంత్రి హరీశ్ రావు పర్యవేక్షించారు. రంగనాయక సాగర్ కుడి కాలువ వెంట శనివారం మంత్రి హరీష్ రావు పర్యటించారు. రైతులు కాలువ వెంట తమ పొలాలకు పిల్లకాలువలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో చెరువులు, కుంటలు పంపేందుకు అధికారులతో అక్కడిక్కడే సమీక్షలు నిర్వహించారు.

రంగనాయక సాగర్ కు గోదావరి నీళ్లు ఇప్పటికే చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ మానసపుత్రిక, మంత్రి హరీశ్ రావు కృషి ఫలితం త్వరలో సిద్ధిపేట ప్రజలకు, రైతులకు దక్కనుంది. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభం అత్యంత అద్భుత ఘట్టం చరిత్రలో నిలువనున్నది. ఈ ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరపాల్సిన సందర్భం కానీ, కరోనా వైరస్ నియంత్రణ కారణంగా ఈ ఘట్టాన్ని సాదాసీదాగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20న పంపింగ్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన అధికారికంగా ప్రకటించకున్నా.. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రంగనాయక సాగర్ ప్రారంభంతో లక్షా పది వేల బీడు భూములు ధాన్యగారం కానున్నాయి. ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.

tags: CM KCR, Harish Rao, Ranganayaka Sagar, Beginning, Farmers, Siddipet People and Officers

Tags:    

Similar News