వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో పదవుల పందెం..
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వాడీవేడిగా చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్ విడుదల కాగా నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎమ్మెల్యేల కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. పదవీకాలం ముగిసిన వారిలో వైసీపీ నుంచి డీసీ గోవిందరెడ్డి, బీజేపీ నుంచి సోము వీర్రాజు, టీడీపీ నుంచి మహ్మద్ షరీఫ్‌లు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం […]
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వాడీవేడిగా చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్ విడుదల కాగా నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎమ్మెల్యేల కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. పదవీకాలం ముగిసిన వారిలో వైసీపీ నుంచి డీసీ గోవిందరెడ్డి, బీజేపీ నుంచి సోము వీర్రాజు, టీడీపీ నుంచి మహ్మద్ షరీఫ్‌లు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
కాబోయే ఎమ్మెల్సీలు వీరే..
ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావాల్సిన మూడు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఎవరా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ముగ్గురు ఎమ్మెల్సీల ఎంపికకు సంబంధించి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా సామాజిక వర్గాల ఆధారంగా పదవులను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఓసీ వర్గాలకు కేటాయించాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు డీసీ గోవిందరెడ్డికి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డీసీ గోవిందరెడ్డిది వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం. బద్వేలు ఉపఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ భావించినట్లు తెలుస్తోంది. ఇకపోతే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎస్సీ మాదిగ ఈక్వేషన్ కోటాలో మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి ఈసారి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం వేంపెంటకు చెందిన లబ్బి వెంకటస్వామి కాంగ్రెస్ హయాంలో పాములపాడు నుంచి జెడ్పీటీసీగా గెలుపొంది జడ్పీ చైర్మన్ పదవి చేపట్టారు. అనంతరం నందికొట్కూరు నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
లబ్బి వెంకటస్వామికి వైఎస్ఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి లబ్బి వెంకటస్వామికి ఈసారి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎస్సీ మాల కుల సమీకరణలలో భాగంగా ముగ్గురుకు అవకాశం కల్పించారు. అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మోషన్ రాజు, చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తిలకు ఎస్సీ మాల సామాజిక వర్గం కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అయితే ఎస్సీ మాదిగ ఈక్వేషన్‌లో భాగంగా ఇప్పటివరకు గుంటూరు జిల్లాకు చెందిన గతంలో టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్.. వైసీపీలో చేరిన తర్వాత మరోసారి ఎమ్మెల్సీగా కొనసాగించింది వైసీపీ. ఈ విడతలో ఎమ్మెల్యేల కోటాలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇకపోతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అభ్యర్థిని ఎంపిక చేసేపనిలో పడింది వైసీపీ అధిష్టానం.