మంత్రి తలసాని కుమారుడిని సేవ్ చేసేందుకు పోలీసుల పాట్లు.. నెటిజన్ల ఫైర్

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కుమార్ యాదవ్ శుక్రవారం ఖైరతాబాద్‌లో జరిగిన సదర్ ఉత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొని తిరిగి కారులో వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తిపై నుంచి కారు వెళ్లడంతో అతని కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో బాధితుడి కుటుంబ సభ్యులు, స్థానికులు సాయికుమార్ యాదవ్‌ కారును అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఇది గమనించిన పోలీసులు మంత్రి కొడుకు కావడంతో గాయపడిన […]

Update: 2021-11-06 08:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కుమార్ యాదవ్ శుక్రవారం ఖైరతాబాద్‌లో జరిగిన సదర్ ఉత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొని తిరిగి కారులో వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తిపై నుంచి కారు వెళ్లడంతో అతని కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో బాధితుడి కుటుంబ సభ్యులు, స్థానికులు సాయికుమార్ యాదవ్‌ కారును అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఇది గమనించిన పోలీసులు మంత్రి కొడుకు కావడంతో గాయపడిన వ్యక్తి కుటుంబానికి నచ్చజెప్పి, బాధితుడిని పోలీసు వాహనంలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఈ ఘటనను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తు్న్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడు, మంత్రి కుమారుడు కావడం వల్ల పోలీసులు ఇలా ప్రవర్తించారంటూ పోలీసులపై మండిపడుతున్నారు. సాయికుమార్ యాదవ్‌పై ఇప్పటి వరకూ ఎలాంటి కేసు కూడా నమోదు చేయకపోవడం సరికాదంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన FIRలో ఎవరి పేరునూ ప్రస్తావించకపోవడం గమనార్హం. FIRలో కేవలం కారు నెంబర్ ‘TS07HW0001’ తో ప్రమాదకరంగా, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం ద్వారా వ్యక్తి కాలుకు గాయమైనట్లు మాత్రమే ఉందని నెట్టింట చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News