వివేకా హత్య కేసు.. నేరం ఒప్పుకోవాలని నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌ కుమార్‌ యాదవ్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నేరం ఒప్పుకోవాలని తనపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగిస్తున్నారని హైకోర్టుకు సునీల్‌ తరుఫు న్యాయవాది వివరించారు. అయితే సునీల్‌ కుమార్ యాదవ్ వాదనల్లో ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ తరపు న్యాయవాది వెల్లడించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఇకపోతే సునీల్ కుమార్ యాదవ్ […]

Update: 2021-07-26 07:26 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌ కుమార్‌ యాదవ్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నేరం ఒప్పుకోవాలని తనపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగిస్తున్నారని హైకోర్టుకు సునీల్‌ తరుఫు న్యాయవాది వివరించారు. అయితే సునీల్‌ కుమార్ యాదవ్ వాదనల్లో ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ తరపు న్యాయవాది వెల్లడించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

ఇకపోతే సునీల్ కుమార్ యాదవ్ దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకాకు సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆయన హత్యకేసులో భాగంగా సీబీఐ అధికారులు సునీల్ కుమార్ యాదవ్‌తోపాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. అయితే ఇటీవలే వాచ్‌మెన్ రంగన్న సునీల్ కుమార్ యాదవ్ పేరు ప్రస్తావిస్తూ వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో సునీల్ కుమార్ యాదవ్ ముందస్తు బెయిల్‌కోసం హైకోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News