ఫ్లైట్‌ను వదిలి బెడ్రూంలో దూరిన పైలట్.. ఇంతలో ఆమె..
దిశ, వెబ్‌డెస్క్: నమ్మిన వారిని మోసం చేయడం పరిపాటిగా మారింది. అక్షర జ్ఞానం లేని వాళ్లు మోసపోతున్నారంటే పొరబడినట్లే. ఉన్నత చదువులు చదివినవారు, సెలబ్రిటీస్ కూడా ఎక్కువగా మోసపోతున్న వారి జాబితాలో ఉంటున్నారు. వీరిలో మహిళాల సంఖ్య అధికం. తాజాగా పైలట్ చేతిలో టీవీ నటి మోసపోయిన ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన ప్రముఖ టీవీ నటికి మ్యాట్రియోనియల్ సైట్ ద్వారా ఓ పైలట్ పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు, చాటింగ్ […]
దిశ, వెబ్‌డెస్క్: నమ్మిన వారిని మోసం చేయడం పరిపాటిగా మారింది. అక్షర జ్ఞానం లేని వాళ్లు మోసపోతున్నారంటే పొరబడినట్లే. ఉన్నత చదువులు చదివినవారు, సెలబ్రిటీస్ కూడా ఎక్కువగా మోసపోతున్న వారి జాబితాలో ఉంటున్నారు. వీరిలో మహిళాల సంఖ్య అధికం. తాజాగా పైలట్ చేతిలో టీవీ నటి మోసపోయిన ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది.
ముంబైకి చెందిన ప్రముఖ టీవీ నటికి మ్యాట్రియోనియల్ సైట్ ద్వారా ఓ పైలట్ పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు, చాటింగ్ కొన్ని రోజులు కొనసాగాయి. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం బలపడింది. ఓ రోజు ఇద్దరం కలుసుకుందామని పైలట్ కోరడంతో ఆమె అతడిని తన ఇంటికి ఆహ్వానించింది. అలా వచ్చిన పైలట్ టీవీ నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. 10 రోజుల క్రితం టీవీ నటి పెళ్లి చేసుకోవాలని కోరడంతో నిరాకరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన నటీమణి.. మంగళవారం ఓషివారా పోలీసు స్టేషన్లో సదరు పైలట్‌పై ఫిర్యాదు చేసింది. తనను అత్యాచారం చేసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది. ఆమె ఫిర్యాదుతో పైలట్‌పై కేసు నమోదు చేశారు ఓషివారా పోలీసులు.