పాలకవర్గం విందు.. వాటాలు పంచుకుని జల్సాలు
దిశ, డోర్నకల్: గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన పంచాయతీ పాలకవర్గం విందు వినోదాలతో జల్సా చేస్తోంది. ఏకంగా పంచాయతీకి సంబంధించిన కార్యాలయాన్నేబార్‌గా మార్చేసారు. అధికార పక్షం కదా.. మమ్మల్ని అడిగేవారెవరంటూ ధీమాతో విందు చేసుకున్న దృశ్యాలు సెల్ ఫోన్‌తో చిత్రీకరించారు. ఆ ఫొటోలు కాస్తా బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రాతినిథ్యం వహిస్తున్న డోర్నకల్ నియోజకవర్గంలోని చిన్న గూడూరులో ఆదివారం చోటుచేసుకుంది. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి 15వ ఆర్థిక […]
దిశ, డోర్నకల్: గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన పంచాయతీ పాలకవర్గం విందు వినోదాలతో జల్సా చేస్తోంది. ఏకంగా పంచాయతీకి సంబంధించిన కార్యాలయాన్నేబార్‌గా మార్చేసారు. అధికార పక్షం కదా.. మమ్మల్ని అడిగేవారెవరంటూ ధీమాతో విందు చేసుకున్న దృశ్యాలు సెల్ ఫోన్‌తో చిత్రీకరించారు. ఆ ఫొటోలు కాస్తా బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రాతినిథ్యం వహిస్తున్న డోర్నకల్ నియోజకవర్గంలోని చిన్న గూడూరులో ఆదివారం చోటుచేసుకుంది. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం కింద నిధులు విడుదల చేస్తోంది. ప్రతి ఇంటికి రూ.1600 చొప్పున గ్రామ పంచాయతీ ఖాతాలో జమచేస్తోంది. డోర్నకల్ నియోజకవర్గంలోని కొత్తగా ఏర్పాటైన చిన్నగూడూరు మండలానికి రూ.30 లక్షలు మంజూరు చేశారు. ఆ నిధుల నుంచి పంచాయతీ పాలకవర్గం ఇప్పటికే సగానికి పైగా డబ్బులు డ్రా చేసినట్టు సమాచారం. గ్రామంలోని గంగమ్మ గుడికి వెళ్లే సీసీ రోడ్డుకు రూ.5లక్షలు వెచ్చించినప్పటికీ చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయకుండా వాటాలు పంచుకుని జల్సాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నగూడూరు పంచాయతీ సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రంలో పంచాయతీ పాలకవర్గం విందు చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, సర్పంచ్ చుక్కేస్తూ, ముక్కలు తినే ఫొటోలు చూసిన గ్రామస్తులు పాలకవర్గం తీరుపై మండిపడుతున్నారు. గ్రామాన్ని ఉద్దారిస్తారని భావించి ఓట్లేసి గెలిపిస్తే, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో విందులు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ పరిధిలో కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రాన్ని బార్‌గా చేసుకోవడం గ్రామానికి తలవంపుగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రంలో ఇలా జల్సాలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కలెక్టర్ పూర్తి స్థాయి విచారణ జరిపి పంచాయతీ పాలకవర్గంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.