భయపెడుతున్న ఒమిక్రాన్ కొత్త నివేదిక.. మరో వారం రోజుల్లో..

దిశ, వెబ్ డెస్క్: కరోనా తో పోల్చితే ఒమిక్రాన్ చాలా ప్రమాదమైనదని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూఎస్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) అనే సంస్థ కూడా పిడుగు లాంటి వార్త చెప్పింది. రానున్న వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని , ఇప్పుడు వస్తున్న అంచనాల ప్రకారం మరో కొద్ది రోజుల్లో ఒమిక్రాన్ విజృంభన ఉంటుందని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లోని 36 రాష్ట్రాలలో చాప […]

Update: 2021-12-16 05:49 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా తో పోల్చితే ఒమిక్రాన్ చాలా ప్రమాదమైనదని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూఎస్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) అనే సంస్థ కూడా పిడుగు లాంటి వార్త చెప్పింది. రానున్న వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని , ఇప్పుడు వస్తున్న అంచనాల ప్రకారం మరో కొద్ది రోజుల్లో ఒమిక్రాన్ విజృంభన ఉంటుందని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లోని 36 రాష్ట్రాలలో చాప కింద నీరులా వ్యాపిస్తోందని అంచనా వేసింది.

అమెరికాలోని మెత్తం కరోనా కేసులలో 3 శాతం పైగా ఒమిక్రాన్ కేసులు వచ్చాయని తెలిపింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ కొత్త వేరియంట్ కేసులు రెట్టింపు అయ్యాయని సీడీసీ డైరెక్టర్ రోచల్ వాలెన్ స్కీ తెలిపారు. అమెరికాకు చెందిన యూఎస్ నేషనల్ జినోమిక్స్ సీక్వెన్సింగ్ అనాలిసిస్ డేటా ప్రకారం ఒక నివేదికను వెల్లడించారు.

రానున్న కాలంలో ప్రపంచంలోని అన్ని దేశాలు జాగ్రత్తలు పాటించాలని యూరోపియన్ హెల్త్ కమిషనర్ స్టెల్లా కిరియాకిడ్స్ తెలిపారు. రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా అన్ని వేరియంట్ల కంటే ఒమిక్రాన్ ఒక అంతు చిక్కని మహమ్మారిగా మారవచ్చని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News