ఇంటర్ కొత్త సిలబస్ పుస్తకాలు విడుదల

దిశ, న్యూస్​బ్యూరో: ఇంటర్మీడియట్​ నూతన సిలబస్​ పాఠ్యపుస్తకాలను శనివారం బోర్డు, తెలుగు అకాడమీ అధికారులు విడుదల చేశారు. ఇంటర్​ బోర్డు సాధారణంగా ప్రతీ ఐదేండ్లకోసారి సిలబస్​ను రివైజ్​ చేస్తుంది. ఇందుకోసం నిపుణులు, ప్రొఫెసర్లతో సబ్జెక్టు కమిటీలను ఏర్పాటు చేస్తారు. 2015–16 విద్యాసంవత్సరంలో కొత్త సిలబస్​ పుస్తకాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది కూడా నూతన సిలబస్​తో పుస్తకాలను సిద్ధం చేసిన ఇంటర్​ బోర్డు​ నూతన సిలబస్​ను రిలీజ్ చేసింది. గతంలో ఫెయిలైన విద్యార్థులు పాత సిలబస్​తో 2021మార్చి […]

Update: 2020-08-29 08:55 GMT

దిశ, న్యూస్​బ్యూరో: ఇంటర్మీడియట్​ నూతన సిలబస్​ పాఠ్యపుస్తకాలను శనివారం బోర్డు, తెలుగు అకాడమీ అధికారులు విడుదల చేశారు. ఇంటర్​ బోర్డు సాధారణంగా ప్రతీ ఐదేండ్లకోసారి సిలబస్​ను రివైజ్​ చేస్తుంది. ఇందుకోసం నిపుణులు, ప్రొఫెసర్లతో సబ్జెక్టు కమిటీలను ఏర్పాటు చేస్తారు. 2015–16 విద్యాసంవత్సరంలో కొత్త సిలబస్​ పుస్తకాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది కూడా నూతన సిలబస్​తో పుస్తకాలను సిద్ధం చేసిన ఇంటర్​ బోర్డు​ నూతన సిలబస్​ను రిలీజ్ చేసింది. గతంలో ఫెయిలైన విద్యార్థులు పాత సిలబస్​తో 2021మార్చి పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే 2021 సప్లిమెంటరీ పరీక్షలకు మాత్రం అందరూ కొత్త సిలబస్​కే రాయాల్సి ఉంటుందని ఇంటర్​ బోర్డు స్పష్టం చేసింది.

Tags:    

Similar News