జైలుకెళ్లానని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..

దిశ, నల్లగొండ: జైలులో మూడు నెలల శిక్ష అనుభవించి, విడుదలైన వారానికే ఓ వ్యక్తి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్​ ఎస్​ఐ ఏమిరెడ్డి రాజశేఖర్​ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూరు మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన ఉబ్బని ఆనంద్​ నల్లగొండ మండలం కతాల్​ గూడలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో నల్లగొండ వన్​ టౌన్​ […]

Update: 2021-09-30 09:59 GMT

దిశ, నల్లగొండ: జైలులో మూడు నెలల శిక్ష అనుభవించి, విడుదలైన వారానికే ఓ వ్యక్తి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్​ ఎస్​ఐ ఏమిరెడ్డి రాజశేఖర్​ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూరు మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన ఉబ్బని ఆనంద్​ నల్లగొండ మండలం కతాల్​ గూడలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో నల్లగొండ వన్​ టౌన్​ పోలీస్​ స్టేషన్లో ఆనంద్​పై కేసు నమోదు కాగా, మూడు నెలలు నల్లగొండ జిల్లా జైలులో శిక్ష అనుభవించి వారం రోజుల ముందే జైలునుంచి విడుదలయ్యాడు.

అనంతరం అతడి భార్య వెంకటమ్మ, కుమారుడితో కలిసి సిలార్​ మియాగూడెంలో కూలిపనులకు వెళ్లారు. రెండు రోజుల ముందు ఆనంద్​ను అక్కడే ఉంచి, కతాల్​గూడకు వచ్చారు. జైలుకు వెళ్లి వచ్చిన నాటినుంచి ఆనందర్​ మనస్తాపానికి గురవుతూ వస్తున్నాడు. గురువారం తెల్లవారు జామున కొత్తపల్లి దగ్గర ఎస్​ఎల్బీసీ కాలువదగ్గరకు వెళ్లి ఓ చెట్టుకు ఆనంద్ (60) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్​ఐ తెలిపారు.

Tags:    

Similar News