బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలను దగ్దం చేయండి: ఎమ్మెల్యే సునిత
దిశ, ఆలేరు: కేంద్రం వైఖరిని నిలదీస్తూ కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 20న అన్ని గ్రామాలలో నిరసనలు చేపట్టాలని శనివారం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తెయడం తో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ, […]
దిశ, ఆలేరు: కేంద్రం వైఖరిని నిలదీస్తూ కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 20న అన్ని గ్రామాలలో నిరసనలు చేపట్టాలని శనివారం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తెయడం తో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.
ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలను దగ్దం చేయాలన్నారు. నియోజక వర్గం లోని అన్ని మండలాలలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని సూచించారు. కేంద్రం వైఖరి పట్ల ఏం చేయాలో పార్టీ శ్రేణులకు గ్రామాలవారిగా దిశానిర్దేశం చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం చేతులైతేసిన విషయాన్ని రైతులకు వివరించాలని చెప్పారు. వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని రైతులకు సూచించాలన్నారు.