మనసున్న మంత్రి.. కరోనాతో మృతిచెందితే రూ.లక్ష అందజేత
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా బాధితులను ఆదుకునేందుకు ఓ మంత్రి ముందుకు వచ్చాడు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న వారు చనిపోయినా, చికిత్స పొందుతున్నా ఆర్థికసాయం చేస్తానని ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. చెక్కలను అందించి ఔరా అనిపించారు. కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంతపుర నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అయిన ఎస్‌టీ సోమశేఖర్ ఈ వరాలను ప్రకటించారు. యశ్వంతపుర నియోజకవర్గ పరిధిలో కరోనాతో మృతిచెందిన వారి కుటుంబీకుల రూ.లక్ష, కరోనాతో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల ఆర్థికసాయం అందించనున్నట్లు […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా బాధితులను ఆదుకునేందుకు ఓ మంత్రి ముందుకు వచ్చాడు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న వారు చనిపోయినా, చికిత్స పొందుతున్నా ఆర్థికసాయం చేస్తానని ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. చెక్కలను అందించి ఔరా అనిపించారు. కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంతపుర నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అయిన ఎస్‌టీ సోమశేఖర్ ఈ వరాలను ప్రకటించారు.
యశ్వంతపుర నియోజకవర్గ పరిధిలో కరోనాతో మృతిచెందిన వారి కుటుంబీకుల రూ.లక్ష, కరోనాతో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల ఆర్థికసాయం అందించనున్నట్లు కర్ణాటక సహకార శాఖ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఆదిచుంచనగిరి పీఠాధిపతి నిర్మలానందనాథస్వామిజీ సమక్షంలో కెంగేరీలో 27 మంది మృతుల కుటుంబాలకు తలా లక్ష రూపాయల చొప్పున అందజేశారు. అంతే కాకుండా బీబీఎంపీ నుంచి ఆసుపత్రిలో చేరినవారికి రూ.25వేలు, సొంతంగా ప్రైవేటు ఆసుపత్రిలో చేరినవారికి రూ.50 వేలతో పాటు నిత్యావసరాలు, మెడికల్ కిట్ ఇవ్వ నున్నట్టు తెలిపారు. ఈ మనసున్న మంత్రిని నియోజకవర్గ ప్రజలు దేవుడిలా భావిస్తున్నారు.