త్వరలో ఊరూరా పల్లె దవాఖానాలు.. ప్రకటించిన మంత్రి హరీష్ రావ్
దిశ, సిద్దిపేట: ప్రజల ఆరోగ్యం కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా పని చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. పేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని సూచించారు. భవిష్యత్తులో ప్రతీ ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారని తెలిపారు. ఆ ఏఎన్ఎం కేంద్రంలో స్టాఫ్ నర్సు, వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు. సిద్ధిపేటలోని చిన్నకోడూర్ ప్రాథమిక […]
దిశ, సిద్దిపేట: ప్రజల ఆరోగ్యం కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా పని చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. పేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని సూచించారు. భవిష్యత్తులో ప్రతీ ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారని తెలిపారు. ఆ ఏఎన్ఎం కేంద్రంలో స్టాఫ్ నర్సు, వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు. సిద్ధిపేటలోని చిన్నకోడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 49 మంది ఆశా కార్యకర్తలకు జియో 4జీ సిమ్ కార్డులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో కావాల్సిన అన్నీ వసతులు ఉన్నాయని, ప్రజలకు మంచి వైద్య సేవలు చేయాలని కోరారు. నిరంతరం వైద్య సేవలు అందించాలని, ప్రతీ వైద్యాధికారి, సిబ్బంది ఆరోగ్య కేంద్రాలలో సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అవసరమైన మందుల కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ కూడా సిద్ధిపేటలోనే ఉందని, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రి పట్ల విశ్వాసం పెరిగేలా ఓపికతో పని చేయాలని సూచించారు.