అత్తారింటికి వచ్చిన అల్లుడు హతం.. దగ్గరుండి చంపించిన కొడుకు

దిశ, ధర్పల్లి: కామారెడ్డి జిల్లా ధర్పల్లి మండలం కోటాల్‌పల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అత్తగారింటికి వచ్చిన అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్పల్లి సీఐ పుప్పాల శ్రీశైలం వివరాల ప్రకారం.. రామారెడ్డికి చెందిన ఉల్లేంగల శ్రీనివాస్‌కు కోటాల్‌పల్లికి చెందిన లక్ష్మితో 23 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇటీవల కుటుంబ కలహాలు పెరగడంతో లక్ష్మి పుట్టింటికి వెళ్లింది. దీంతో శ్రీనివాస్‌పై కొడుకు శ్రీకాంత్‌కు, బావమరిది గంగాధర్‌కు కోపం […]

Update: 2021-11-23 08:31 GMT
Murder
  • whatsapp icon

దిశ, ధర్పల్లి: కామారెడ్డి జిల్లా ధర్పల్లి మండలం కోటాల్‌పల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అత్తగారింటికి వచ్చిన అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్పల్లి సీఐ పుప్పాల శ్రీశైలం వివరాల ప్రకారం.. రామారెడ్డికి చెందిన ఉల్లేంగల శ్రీనివాస్‌కు కోటాల్‌పల్లికి చెందిన లక్ష్మితో 23 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇటీవల కుటుంబ కలహాలు పెరగడంతో లక్ష్మి పుట్టింటికి వెళ్లింది. దీంతో శ్రీనివాస్‌పై కొడుకు శ్రీకాంత్‌కు, బావమరిది గంగాధర్‌కు కోపం వచ్చింది. ఎలాగైనా శ్రీనివాస్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. మరో ఇద్దరి సాయంతో రాత్రి పొలం వద్ద దావత్ చేసుకుందామని రామారెడ్డి నుంచి శ్రీనివాస్‌ను రప్పించారు.

అనంతరం మద్యం మత్తులో బావమరిది గంగాధర్, బావ శ్రీనివాస్ తలపై పారతో బలంగా కొట్టడంతో ఉన్నట్టుండి కిందపడిపోయాడు. అనంతరం కాళ్లతో గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. మృతుడి తమ్ముడు లింబాద్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐ శ్రీశైలం తమదైన శైలిలో విచారణ జరుపగా నేరం రుజువైంది. హత్యలో భాగస్వాములైన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News