హార్లీ బైక్ గాంధీ మహాత్ముడు

దిశ, ఫీచర్స్: మహాత్మగాంధీ పేరు వినగానే.. బోసి నవ్వుల రూపం, ధోతి, కండువా, గుండ్రని కళ్లద్దాలు, చేతిలో కర్ర గుర్తుకొస్తాయి. సింప్లిసిటీకి మరో రూపంగా కనిపించే బాపూజీని ఇంకో రూపంలో ఊహించలేం. ఇంగ్లాండ్‌లో బారిష్టర్ చేసిన సమయంలో సూటు ధరించిన గాంధీ, ఆ తర్వాత స్వాతంత్ర్యోద్యమ బాట పట్టాక తన వేషధారణ పూర్తిగా మార్చేశాడు. అంతేకాదు విదేశీ వస్తు బహిష్కరణకు కూడా పిలుపునిచ్చాడు. అలాంటి జాతిపితను నేటి మోడ్రన్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నట్లు బొమ్మల శ్రేణిని రూపొందించాడు ఓ […]

Update: 2021-08-20 10:57 GMT

దిశ, ఫీచర్స్: మహాత్మగాంధీ పేరు వినగానే.. బోసి నవ్వుల రూపం, ధోతి, కండువా, గుండ్రని కళ్లద్దాలు, చేతిలో కర్ర గుర్తుకొస్తాయి. సింప్లిసిటీకి మరో రూపంగా కనిపించే బాపూజీని ఇంకో రూపంలో ఊహించలేం. ఇంగ్లాండ్‌లో బారిష్టర్ చేసిన సమయంలో సూటు ధరించిన గాంధీ, ఆ తర్వాత స్వాతంత్ర్యోద్యమ బాట పట్టాక తన వేషధారణ పూర్తిగా మార్చేశాడు. అంతేకాదు విదేశీ వస్తు బహిష్కరణకు కూడా పిలుపునిచ్చాడు. అలాంటి జాతిపితను నేటి మోడ్రన్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నట్లు బొమ్మల శ్రేణిని రూపొందించాడు ఓ కళాకారుడు. ఎందుకలా చేశాడో తెలుసుకుందాం.

కళాకారుడు దేబంజన్ రాయ్ ‘టాయ్‌యింగ్ విత్ గాంధీ’తో దేశ ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు. మహాత్ముడు అందించిన లైఫ్ ఫిలాసఫీ, సూత్రాలు, తత్వశాస్త్రాన్ని తగ్గిస్తూ గాంధీని ఓ బొమ్మలా మార్చేశారని అతడి బొమ్మల ద్వారా చెబుతున్నాడు. ఉదాహరణకు ‘ది బాబ్‌హెల్‌హెడ్ గాంధీ’ శిల్పం. ఇందులో లాట్రిన్ క్లీనర్‌ను పోలి ఉండే పొడవైన రాడ్‌ను కలిగి ఉంటుంది. ప్రఖ్యాత గాంధీ లాఠీకి బదులుగా, ఈ ఆధునిక మరుగుదొడ్డి క్లీనర్ అనేది మాన్యువల్ స్కావెంజర్ల జీవితాలపై ఓ భావప్రకటనలా నిలుస్తుంది. అంతేకాదు స్వచ్ఛ్ భారత్ అభియాన్ గురించి వ్యాఖ్యను జోడిస్తుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ డ్రైవ్ చేయడం, షాపింగ్ కార్ట్ తోసుకుంటూ ఫోన్ మాట్లాడటం, మసాజ్ కుర్చీపై పడుకోడం వంటి అనేక శిల్పాలు నేటి తరపు పోకడలను ప్రశ్నిస్తాయి. అవి మారుతున్న కాలానికి ప్రబలమైన వినియోగదారుల వైఖరిని ప్రతిబింబించే చిత్రాలుగా నిలుస్తాయి. ఇక గాంధీ తత్వానికి మూలం-గాంధీగిరి. ఆయన అహింస కోసం నిలబడినందున ఎరుపు రంగులో అతడి విగ్రహం నేటి కాలపు హింసకు రూపంగా నిలుస్తుంది. మహాత్మా విగ్రహాంపై ఓ కాకి తలపై కొట్టుకుంటుంది కానీ గాంధీ ఆనందంతో నవ్వుతూ ఉంటాడు. భారతదేశానికి ఏమి జరిగిందో చూడటానికి అతను జీవించి ఉంటే పరిస్థితి ఇలానే ఉంటుందనే దానికి నిదర్శనంగా ఇది నిలుస్తుంది. ఆ మహాత్ముడు దేనికోసం నిలబడ్డాడు, అతని ఆదర్శాల నుండి మనం ఎంత దూరం వచ్చామో గుర్తుకు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడు దేబంజన్.

Tags:    

Similar News