గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ.. 150 గొర్రెలు మృతి

దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామ శివారులో లోడ్‌తో వెళుతున్న లారీ బీభత్సం సృష్టించింది. ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన భిక్షపతి, స్వామి, సత్తమ్మ, నర్సింలులకు చెందిన గొర్రెలు రోడ్డు దాటుతుండగా, గజ్వేల్ నుంచి తుపాన్‌కు వెళ్తున్న లారీ కోమటిబండ గ్రామంలోని రాజీవ్ రహదారిపై ఒక్కసారిగా గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. దీంతో సుమారు 150 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. లారీ కింద పడి నుజ్జునుజ్జయిన గొర్రెలను చూసి యజమానులు బోరున విలపించారు. తమకున్న ఏకైక […]

Update: 2020-08-27 06:11 GMT

దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామ శివారులో లోడ్‌తో వెళుతున్న లారీ బీభత్సం సృష్టించింది. ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన భిక్షపతి, స్వామి, సత్తమ్మ, నర్సింలులకు చెందిన గొర్రెలు రోడ్డు దాటుతుండగా, గజ్వేల్ నుంచి తుపాన్‌కు వెళ్తున్న లారీ కోమటిబండ గ్రామంలోని రాజీవ్ రహదారిపై ఒక్కసారిగా గొర్రెల మందపైకి దూసుకెళ్లింది.

దీంతో సుమారు 150 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. లారీ కింద పడి నుజ్జునుజ్జయిన గొర్రెలను చూసి యజమానులు బోరున విలపించారు. తమకున్న ఏకైక జీవనాధారం ఈ గొర్రెలేనని, ఇప్పుడు తమ బతుకులు ఎలా గడవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని రోడ్డు పై బైటాయించారు. విషయం తెలుసుకున్న గజ్వేల్ సీఐ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News