టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో నాయకుల మధ్య ఘర్షణ

దిశ, కరీంనగర్:రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా తమ తమ ఇండ్లలోనే ఎగరేసుకోవాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. సీఎం మాటలను ఎవరూ లెక్కచేయకుండా అందరూ బయటకు వచ్చి పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిపారు. పెద్దపల్లి జిల్లాలో వెరైటీగా పార్టీ జెండాను నేను ఎగరేస్తానంటే నేను ఎగురేస్తానని టీఆర్ఎస్ నాయకులు కొట్లాడుకున్నారు. పెద్దపల్లి జిల్లా జాలపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఘర్షణలో టీఆర్ఎస్‌లో అంతర్గత ఘర్షణలు […]

Update: 2020-04-27 02:51 GMT

దిశ, కరీంనగర్:రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా తమ తమ ఇండ్లలోనే ఎగరేసుకోవాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. సీఎం మాటలను ఎవరూ లెక్కచేయకుండా అందరూ బయటకు వచ్చి పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిపారు. పెద్దపల్లి జిల్లాలో వెరైటీగా పార్టీ జెండాను నేను ఎగరేస్తానంటే నేను ఎగురేస్తానని టీఆర్ఎస్ నాయకులు కొట్లాడుకున్నారు. పెద్దపల్లి జిల్లా జాలపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఘర్షణలో టీఆర్ఎస్‌లో అంతర్గత ఘర్షణలు బయటపడ్డాయి. ఈ వివాదం మొత్తం జిల్లా గ్రంధాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ ఎదుటే జరగడం గమనార్హం. జెండాను ఎగరేయడానికి పోటీ పడి సగం వరకు ఎగిరిన జెండాను కిందకు దించేశారు. ఈ వ్యవహారన్ని కల్లారా చూసిన జూలపల్లి నాయకులు వ్యవహరించిన తీరు చూసి కార్యకర్తలు ముక్కున వేలేసుకున్నారు.

Tags:    

Similar News