ఎంత మేర‌కు ఉపాధి లభిస్తున్న‌ది: మంత్రి ఎర్రబెల్లి

దిశ, వరంగల్: ఉపాధి కూలీల‌కు క‌నీసం రూ.200 ల‌కు త‌గ్గ‌కుండా ప్ర‌తి రోజూ వేత‌నం అందేలా చూడాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి నుంచి వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాకు వెళుతున్న మంత్రి మార్గం మ‌ధ్యలో ఉప్ప‌ర‌ప‌ల్లి వ‌ద్ద ఆగి ఉపాధి హామీ ప‌నులు జ‌రుగుతున్న తీరును ప‌రిశీలించారు. కూలీల‌కు మాస్కులు పంపిణీ చేశారు. రోజు వారీగా ఎంత మేర‌కు ఉపాధి లభిస్తున్న‌ద‌ని కూలీలను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం అక్క‌డే […]

Update: 2020-06-15 02:57 GMT

దిశ, వరంగల్: ఉపాధి కూలీల‌కు క‌నీసం రూ.200 ల‌కు త‌గ్గ‌కుండా ప్ర‌తి రోజూ వేత‌నం అందేలా చూడాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి నుంచి వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాకు వెళుతున్న మంత్రి మార్గం మ‌ధ్యలో ఉప్ప‌ర‌ప‌ల్లి వ‌ద్ద ఆగి ఉపాధి హామీ ప‌నులు జ‌రుగుతున్న తీరును ప‌రిశీలించారు. కూలీల‌కు మాస్కులు పంపిణీ చేశారు. రోజు వారీగా ఎంత మేర‌కు ఉపాధి లభిస్తున్న‌ద‌ని కూలీలను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం అక్క‌డే ఉన్న అధికారులతో మాట్లాడారు. కూలీల‌కు రోజుకు క‌నీసం రూ. 200 ల‌కు త‌గ్గ‌కుండా వేత‌నం ల‌భించేలా చూడాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు ఉపాధి కూలీల‌కు ప‌నులు చెప్పాల‌న్నారు. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు అత్య‌ధికంగా ప‌ని దినాలు ఉపాధి క‌ల్పిస్తున్నామ‌న్నారు.

Tags:    

Similar News