ప్రజల ప్రాణాలు ముఖ్యమా.? లేక ఎన్నికలా : హైకోర్టు సీరియస్
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు ముఖ్యమా.? లేక ఎన్నికల ముఖ్యమా అన్ని ప్రశ్నించింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వం తీరునూ తప్పుపట్టింది. రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగియనుందని.. ఆ తర్వాత చర్యలు ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. రేపు […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు ముఖ్యమా.? లేక ఎన్నికల ముఖ్యమా అన్ని ప్రశ్నించింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వం తీరునూ తప్పుపట్టింది.
రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగియనుందని.. ఆ తర్వాత చర్యలు ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. రేపు పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇవ్వగా.. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని వ్యాఖ్యానించింది. నియంత్రణ చర్యలపై తాము ఎలాంటి సూచనలు ఇవ్వడం లేదని.. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.