ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టు సీరియస్.. వారికి డబ్బు ఇవ్వాల్సిందే..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కట్టడి, ప్రస్తుత పరిస్థితులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. నిన్న ఖమ్మం పర్యటనలో ఉన్న డీహెచ్‌ శ్రీనివాస్ రావు హైకోర్టులో విచారణకు హాజరు కాలేకపోయారు. డీహెచ్‌ విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేయడంతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ బాధితుల నుంచి అధిక […]

Update: 2021-06-02 05:58 GMT
ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టు సీరియస్.. వారికి డబ్బు ఇవ్వాల్సిందే..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కట్టడి, ప్రస్తుత పరిస్థితులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. నిన్న ఖమ్మం పర్యటనలో ఉన్న డీహెచ్‌ శ్రీనివాస్ రావు హైకోర్టులో విచారణకు హాజరు కాలేకపోయారు. డీహెచ్‌ విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేయడంతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన విచారణకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు చెల్లించిన పేషెంట్లకు డబ్బు రీఫండ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ చికిత్స ధరలపై ప్రభుత్వం కొత్త జీవో ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు బ్లూ ప్రింట్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు ఏం చర్యలు చేపట్టారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.

 

Tags:    

Similar News