దిశ ఎఫెక్ట్.. గ్రామ పంచాయతీ కార్మికుల కష్టాలు దూరం
ఈ నెల 24 న దిశ లో "సిబ్బంది వేతనాలు వాడుకున్న కార్యదర్శి" అనే
దిశ, కేసముద్రం: ఈ నెల 24 న దిశ లో "సిబ్బంది వేతనాలు వాడుకున్న కార్యదర్శి" అనే శీర్షిక ద్వారా ప్రచురితమైంది.ఆ వార్త కధనానికి అధికార యంత్రాంగం స్పందించి కేసముద్రం విలేజ్ గ్రామ పంచాయతీ కార్మికులకు గత కొన్ని నెలలుగా రాని జీతాలను రికవరీ చేసి కార్మికులకు ఇప్పించారు. వివరాల్లోకి వెళితే కేసముద్రం విలేజ్ పంచాయతీ కార్యదర్శి , కార్మికుల జీతాలను సుమారురూ. 2 లక్షల 15 వేల రూపాయలను తన సొంతానికి వాడుకొని సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా కొన్ని నెలలుగా ఇబ్బంది పెట్టగా, ఆ సిబ్బంది, పై అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్మికులకు బాసటగా "దిశ" నిలిచి, వారి తరుపున కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం సదరు కార్యదర్శి నుండి వారి వేతనాల డబ్బును రికవరీ చేసి పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించారు.