వైద్యం, విద్యకు ప్రభుత్వం పెద్దపీట : వినోద్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం వైద్యం, విద్యకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆయనకు ఏం చేయాలో తెలియక ఉచిత వైద్యం […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం వైద్యం, విద్యకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆయనకు ఏం చేయాలో తెలియక ఉచిత వైద్యం విద్య అంటున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పునర్విభజన చట్టంలోని తుంగలో తొక్కిన కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం మిషన్ కాకతీయ తో తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరిగాయని, మూడేళ్లు కరువు చాయలు ఏర్పడిన తెలంగాణలో నీటి కొరత ఉండదని పేర్కొన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో కేవలం ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, రాష్ట్రం వచ్చిన తర్వాత తొమ్మిది మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ తోపాటు నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటు చేసి రక్తం, గుండె పరీక్షలను పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రం ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదని, అన్ని రాష్ట్రాలకు కేటాయించిన విధంగానే ఫైనాన్స్ కమిషన్ దిశా నిర్దేశం మేరకు రావాల్సిన నిధులు మాత్రమే కేటాయించిందని తెలిపారు.
విద్యా రంగానికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని అందులో భాగంగానే ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ స్కూల్ లతో పాటు కస్తూరిబా స్కూల్స్, మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేసిందన్నారు. 986 రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాలలో అప్ గ్రేడ్ చేసిందన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.