ఢిల్లీకి చేరిన మొదటి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీకి 70 మెట్రిక్‌ టన్నుల మొదటి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం చేరిందని దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను చేరవేసేందుకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందన్నారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లీ ప్రాంతాలకు 10వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి 6 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మొత్తం 26 ట్యాంకర్ల ద్వారా 450 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను చేరవేసిందని అధికారులు […]

Update: 2021-04-27 10:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీకి 70 మెట్రిక్‌ టన్నుల మొదటి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం చేరిందని దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను చేరవేసేందుకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందన్నారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లీ ప్రాంతాలకు 10వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి 6 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మొత్తం 26 ట్యాంకర్ల ద్వారా 450 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను చేరవేసిందని అధికారులు వివరించారు.

ప్రస్తుతం మరో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ జబల్‌పూర్‌ మీదుగా బోకారో నుంచి భోపాల్‌కు వెళ్తుందని, ఈ రైలులో ఆరు ట్యాంకర్లలో 64 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ఉందన్నారు. ఇది మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, జబల్‌పూర్‌ మీదుగా సాగి అక్కడి ఆక్సిజన్‌ కోరతను తీర్చనున్నట్లు వెల్లడించారు. లక్నో నుంచి మరో ఖాలీ రేక్‌ బొకారోకు చేరుకుందని, దీంతో మరో సెట్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఉత్తర ప్రదేశ్‌లోని ఆక్సిజన్‌ను సరఫరాచేసి కొరతను తీర్చనున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకు తక్షణ అవసరాలకు భారతీయ రైల్వే ఉత్తర ప్రదేశ్‌కు 202 మెట్రిక్‌ టన్నులు, మహారాష్ట్రకు 174 మెట్రిక్‌ టన్నులు, ఢిల్లీకి 70 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను చేరవేసిందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో మధ్యప్రదేశ్‌కు 64 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ చేరుతుందని అధికారులు వివరించారు.

Tags:    

Similar News