తిరుపతిలో టెన్షన్.. 16 మందిని కలసిన డెల్టాప్లస్ బాధితుడు
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతోంది అనుకునేలోపే ఏపీనీ డెల్టాప్లస్ వేరియంట్ కలవర పెడుతోంది. ఇప్పటికే ఎపీలో డెల్టాప్లస్ వేరియంట్ కేసు బయటపడగా మరోసారి తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైంది. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు డెల్టాప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తి ప్రాథమిక కాంట్రాక్టులుగా 16 మందిని గుర్తించారు.వీరి నుంచి రెండు శాంపిల్స్ సేకరించి ఒకటి సీసీఎంబీకి మరొకటి, స్విమ్స్ కు పంపారు అధికారులు. […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతోంది అనుకునేలోపే ఏపీనీ డెల్టాప్లస్ వేరియంట్ కలవర పెడుతోంది. ఇప్పటికే ఎపీలో డెల్టాప్లస్ వేరియంట్ కేసు బయటపడగా మరోసారి తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైంది. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు డెల్టాప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తి ప్రాథమిక కాంట్రాక్టులుగా 16 మందిని గుర్తించారు.వీరి నుంచి రెండు శాంపిల్స్ సేకరించి ఒకటి సీసీఎంబీకి మరొకటి, స్విమ్స్ కు పంపారు అధికారులు. అయితే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ వలన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా అధికారులు అంటున్నారు. ప్రస్తుతం వైరస్ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. ఇక జిల్లా వైద్యాధికారి శ్రీహరి డెల్టాప్లస్ వైరస్ కేసు వెలుగుచూసిన ప్రాంతాల్లో పర్యటించి ఫీవర్ సర్వేపై పలు సూచనలు ఇచ్చారు.