కూతురి పై ప్రేమ ప్రాణం తీసింది
దిశ, వెబ్‌డెస్క్: కూతురి పై ఆ తండ్రి పెంచుకున్న ప్రేమ అతడి ప్రాణాన్నే తీసుకుంది. కూతురు అకాల మరణం చెందడంతో ఆ తండ్రి కుమిలిపోయాడు. చివరికి కూతురి సమాధి వద్దే తనువు చలించాడు. ఈ విషాద ఘటన కృష్ణ జిల్లాలోని మచిలీపట్నంలో వెలుగుచూసింది. మచిలీపట్నంలోని జలాల్‌పేటకు చెందిన లక్కోజు గిరిబాబు (52) బంగారం వ్యాపారం చేసేవాడు. అయితే, కొంతకాలం క్రితం తన పెద్దకూతురు రేణుకాదేవి వివాహం అంగరంగ వైభవంగా చేశాడు. కాగా, రేణుకాదేవి ఇటీవల గర్భం దాల్చింది. […]
దిశ, వెబ్‌డెస్క్: కూతురి పై ఆ తండ్రి పెంచుకున్న ప్రేమ అతడి ప్రాణాన్నే తీసుకుంది. కూతురు అకాల మరణం చెందడంతో ఆ తండ్రి కుమిలిపోయాడు. చివరికి కూతురి సమాధి వద్దే తనువు చలించాడు. ఈ విషాద ఘటన కృష్ణ జిల్లాలోని మచిలీపట్నంలో వెలుగుచూసింది.
మచిలీపట్నంలోని జలాల్‌పేటకు చెందిన లక్కోజు గిరిబాబు (52) బంగారం వ్యాపారం చేసేవాడు. అయితే, కొంతకాలం క్రితం తన పెద్దకూతురు రేణుకాదేవి వివాహం అంగరంగ వైభవంగా చేశాడు. కాగా, రేణుకాదేవి ఇటీవల గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె కొద్దిగా అస్వస్థతకు గురైంది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ వార్త విన్న గిరిబాబు కన్నీరుమున్నీరయ్యాడు. తన కూతురు ఇక లేదని తనలో తాను కృంగిపోయాడు.
అయితే, కూతురిపై ఉన్న ప్రేమతో తరచూ ఆమె సమాధి వద్దకు వెళ్లి వస్తుండేవాడు. తన కూతురుని తలచకుంటూ అక్కడే విలపించేవాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం కూతురు సమాధి వద్దకు వెళ్లిన గిరిబాబు ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబీకులు గాలింపు చేపట్టారు.
ఎంతకీ ఆచూకీ తెలియకపోవడంతో చివరగా కుటుంబీకులు రేణుకాదేవి సమాధి వద్దకు వెళ్లి చూడగా విగతా జీవిగా కనిపించాడు. ఈ విషాద ఘటన చవిచూసిన బాధిత కుటుంబీకుల రోధన వర్ణానాతీతం. అనంతరం ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.