విద్యాశాఖ కీలక నిర్ణయం.. పాఠశాలకు ఎన్ని రోజులు వెళ్లాలంటే !
దిశ,డైనమిక్ బ్యూరో : తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలన్నీ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను విద్యా శాఖ విడుదల చేసింది. 2021-22 విద్యా సంవత్సరంలో 213 బోధన తరగతులు నిర్వహించాలని ఖరారు చేసింది. అయితే గతంలో నిర్వహించిన 47 రోజుల ఆన్‌లైన్ తరగతులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అక్టోబరు 6 నుంచి 17 వరకు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 22 నుంచి 28 వరకు […]
దిశ,డైనమిక్ బ్యూరో : తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలన్నీ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను విద్యా శాఖ విడుదల చేసింది. 2021-22 విద్యా సంవత్సరంలో 213 బోధన తరగతులు నిర్వహించాలని ఖరారు చేసింది. అయితే గతంలో నిర్వహించిన 47 రోజుల ఆన్‌లైన్ తరగతులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అక్టోబరు 6 నుంచి 17 వరకు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.