గుంతల రోడ్లు.. సైక్లింగ్ పౌరుల పాట్లు.. నెటిజన్ల ఫైర్

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో సైక్లింగ్‌ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికోసం కొన్ని చోట్ల రోడ్డుకు ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘ సైకిల్ ఫర్ చేంజ్’ చాలెంజ్ లో దేశంలోని107 నగరాల్లో హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచింది. అయితే, దీనిపై ప్రస్తుతం నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. బైసైకిల్ మేయర్ ఆఫ్ హైదరాబాద్ చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. నగరంలోని రోడ్లు గుంతలు గుంతలుగా ఉండటంతో ఓ […]

Update: 2021-09-29 05:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో సైక్లింగ్‌ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికోసం కొన్ని చోట్ల రోడ్డుకు ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘ సైకిల్ ఫర్ చేంజ్’ చాలెంజ్ లో దేశంలోని107 నగరాల్లో హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచింది. అయితే, దీనిపై ప్రస్తుతం నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. బైసైకిల్ మేయర్ ఆఫ్ హైదరాబాద్ చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తోంది.

నగరంలోని రోడ్లు గుంతలు గుంతలుగా ఉండటంతో ఓ సైకిలర్ తన సైకిల్ ని ఎత్తుకొని వెళుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. గుంతల రోడ్డు కారణంగా ఆయన సైకిల్ టైర్ పూర్తిగా బెండ్ అయ్యింది. ఇలాంటి రోడ్ల వల్ల బైసైకిలర్స్ తో పాటు పాదచారులు ఇబ్బందులు పడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేశారు.

Tags:    

Similar News