‘ఏపీకి దేశీ, విదేశీ పారిశ్రామికవేత్తల క్యూ’

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించడంతో ఏపీకి దేశవిదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వనవసరంలేదని వాళ్లకు అర్థమైందని, గతంలో తండ్రీకొడుకులకు సూట్ కేసులు అందించనిదే భూకేటాయింపులు జరిగేవి కావని వ్యాఖ్యానించారు. ఇప్పుడా చెడ్డపేరు తొలగిపోయిందన్న విజయసాయిరెడ్డి, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు భారీగా తరలివస్తున్నారని అన్నారు. అటు, మాన్సాస్ ట్రస్టు గురించి వ్యాఖ్యానిస్తూ, పేరుకు […]

Update: 2020-06-05 06:21 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించడంతో ఏపీకి దేశవిదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వనవసరంలేదని వాళ్లకు అర్థమైందని, గతంలో తండ్రీకొడుకులకు సూట్ కేసులు అందించనిదే భూకేటాయింపులు జరిగేవి కావని వ్యాఖ్యానించారు. ఇప్పుడా చెడ్డపేరు తొలగిపోయిందన్న విజయసాయిరెడ్డి, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు భారీగా తరలివస్తున్నారని అన్నారు. అటు, మాన్సాస్ ట్రస్టు గురించి వ్యాఖ్యానిస్తూ, పేరుకు మాత్రమే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, పచ్చగా ఏది కనిపించినా నక్కజిత్తులన్నీ ప్రయోగించి దోపిడీకి తెగబడతాడని ఆరోపించారు. మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత ఆనంద గజపతి లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేకపోతున్నాడని విమర్శించారు. ట్రస్టును భ్రష్టుపట్టించాడు కాబట్టే సైలెంటైపోయాడని, కానీ దర్యాప్తులో తప్పించుకోలేడని అన్నారు.

Tags:    

Similar News