అప్పటివరకు ‘సాగర్’ ఎగ్జిట్ పోల్స్ ఆపండి.. ఎస్‌ఈసీకి కాంగ్రెస్ లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మినీ పురపోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీపీసీసీ తరుపున లేఖ రాశారు. తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు నాగార్జునసాగర్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెల్లడించకుండా నిషేధించాలని కోరారు. గురువారం సాయంత్రం 7 గంటలకు ఎగ్జిట్‌పోల్ ఫలితాల […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మినీ పురపోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీపీసీసీ తరుపున లేఖ రాశారు. తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు నాగార్జునసాగర్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెల్లడించకుండా నిషేధించాలని కోరారు. గురువారం సాయంత్రం 7 గంటలకు ఎగ్జిట్‌పోల్ ఫలితాల వెల్లడికి ఈసీ అనుమతించిందని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని టీపీసీసీ పేర్కొంది. దీనిపై ఎన్నికల కమిషన్ అధికారులకు లేఖ, ఫోన్ ద్వారా విన్నవించామని టీపీసీసీ ఎన్నికల కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ నిరంజన్ తెలిపారు.