‘జైలుకు పంపేందుకూ వెనుకాడం’

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు కలెక్టర్ ఎం.హనుమంతరావు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగే వారికి చర్యలు తప్పవని హెచ్చరించారు. మాస్కులు ధరించకపోయినా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా.. జరిమానాలు విధించనున్నట్టు తెలిపారు. బైక్‌పై ఇద్దరు వెళ్తే రూ.500, మాస్క్ లేకుండా తిరిగితే రూ.100, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే రూ.500 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. కంటైన్‌మెంట్ ఏరియా నుంచి బయట తిరిగితే జైలుకు పంపడానికి కూడా వెనుకాడబోమనీ, […]

Update: 2020-04-16 01:25 GMT

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు కలెక్టర్ ఎం.హనుమంతరావు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగే వారికి చర్యలు తప్పవని హెచ్చరించారు. మాస్కులు ధరించకపోయినా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా.. జరిమానాలు విధించనున్నట్టు తెలిపారు. బైక్‌పై ఇద్దరు వెళ్తే రూ.500, మాస్క్ లేకుండా తిరిగితే రూ.100, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే రూ.500 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. కంటైన్‌మెంట్ ఏరియా నుంచి బయట తిరిగితే జైలుకు పంపడానికి కూడా వెనుకాడబోమనీ, ప్రభుత్వ క్వారంటైన్ భవనాలకు తరలిస్తామని తెలిపారు. కిరాణా, మందుల దుకాణాలు, ఇతర నిత్యావసర దుకాణాల వద్ద ప్రజలు గుమికూడినా, సామాజిక దూరం పాటించకపోయినా షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వినియోగదారులు నిబంధనలు పాటించేలా షాపు యజమానులే చర్యలు తీసుకోవాలని సూచించారు. మే 3వరకు అందరూ స్వీయ నియంత్రణలో ఉండి లాక్‌డౌన్ నిబంధనలు విధిగా పాటించి కరోనాను తరిమికొట్టాలన్నారు.

Tags: collector, warned, take action, turning, roads, medak, lockdown

Tags:    

Similar News