ట్విట్టర్‌పై చర్యలు తీసుకోవడానికి కేంద్రానికి స్వేచ్ఛ

న్యూఢిల్లీ: నూతన ఐటీ చట్టాలను పాటించనట్టయితే సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌పై యాక్షన్ తీసుకోవడానికి కేంద్రానికి స్వేచ్ఛ ఉన్నదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. తాము ట్విట్టర్‌కు రక్షణ కల్పించడం లేదని వివరించింది. ట్విట్టర్ ఇండియాకు తాత్కాలిక చీఫ్ కంప్లయెన్స్ అధికారిని నియమించామని, గ్రీవెన్స్ అధికారి నియామకానికి ఎనిమిది వారాల గడువు కావాలని మూడు రోజుల క్రితం సంస్థ కోరిన తర్వాత కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. చట్టాలను అమలు చేస్తున్నట్టు తెలియజేసే అఫిడవిట్‌ను ఈ నెల […]

Update: 2021-07-08 08:15 GMT

న్యూఢిల్లీ: నూతన ఐటీ చట్టాలను పాటించనట్టయితే సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌పై యాక్షన్ తీసుకోవడానికి కేంద్రానికి స్వేచ్ఛ ఉన్నదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. తాము ట్విట్టర్‌కు రక్షణ కల్పించడం లేదని వివరించింది. ట్విట్టర్ ఇండియాకు తాత్కాలిక చీఫ్ కంప్లయెన్స్ అధికారిని నియమించామని, గ్రీవెన్స్ అధికారి నియామకానికి ఎనిమిది వారాల గడువు కావాలని మూడు రోజుల క్రితం సంస్థ కోరిన తర్వాత కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. చట్టాలను అమలు చేస్తున్నట్టు తెలియజేసే అఫిడవిట్‌ను ఈ నెల 11న సమర్పిస్తామనీ ట్విట్టర్‌కు తెలిపింది.

చట్టాల అమలుకు సంబంధించి హార్డ్ కాపీలను సమర్పించడానికి జస్టిస్ రేఖా పల్లి తాజాగా రెండు వారాల గడువును సంస్థకు ఇచ్చారు. సాఫ్ట్ కాపీలను 13లోగా పంపించాలని ఆదేశించారు. చట్టాలను అమలు చేస్తున్నట్టు తెలియజేసే అఫిడవిట్‌లను దాఖలు చేయడానికి మాత్రమే తాము సంస్థకు గడువునిచ్చామని, ఎలాంటి రక్షణను కల్పించట్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ నిజంగానే ట్విట్టర్ నూతన ఐటీ చట్టాలను పాటించకుంటే సంస్థపై చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉన్నదని వివరించారు.

Tags:    

Similar News