ఇకపై ఇంటర్నెట్ ద్వారా ఓటు

దిశ, వెబ్‌డెస్క్: ఓటు హక్కు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలను తీసుకొస్తుంది. కొత్త సంస్కరణలను అమల్లోకి తెస్తోంది. ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అనేక సంస్కరణలను అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా ఓటర్లకు మరో కొత్త అవకాశాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రజలు తమ ఓటు హక్కు వృథా కాకుండా వినియోగించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సీఈసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇకపై ఇంటర్నెట్ ద్వారా కూడా […]

Update: 2021-03-20 21:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓటు హక్కు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలను తీసుకొస్తుంది. కొత్త సంస్కరణలను అమల్లోకి తెస్తోంది. ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అనేక సంస్కరణలను అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా ఓటర్లకు మరో కొత్త అవకాశాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రజలు తమ ఓటు హక్కు వృథా కాకుండా వినియోగించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సీఈసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇకపై ఇంటర్నెట్ ద్వారా కూడా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించనుంది దూరప్రాంతాల్లో ఉంటూ.. ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతానికి రాలేని ఓటర్లకు ఈ అవకాశం కల్పించనుంది. దీనికి సంబంధించి త్వరలో రిమోట్ ఓటింగ్ సిస్టంను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకురానుంది.

Tags:    

Similar News