హైదరాబాద్‌కు రూ.117కోట్లు విడుదల
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరానికి రూ.117కోట్లను కేంద్ర ఫైనాన్స్ శాఖ విడుదల చేసింది. మిలియన్ కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో గాలి శుద్ధతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2020-21 ఏడాదికి గాను దేశంలోని 42నగరాలకు రూ.2,200 కోట్లను కేటాయించింది. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు అర్బన్ లోకల్ విభాగం (యూఎల్‌బీ) గ్రాంట్‌ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడతలో భాగంగా నగరానికి రూ.117 కోట్లు కేటాయించింది. గాలి స్వచ్ఛతను పెంచడంలో […]
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరానికి రూ.117కోట్లను కేంద్ర ఫైనాన్స్ శాఖ విడుదల చేసింది. మిలియన్ కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో గాలి శుద్ధతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2020-21 ఏడాదికి గాను దేశంలోని 42నగరాలకు రూ.2,200 కోట్లను కేటాయించింది. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు అర్బన్ లోకల్ విభాగం (యూఎల్‌బీ) గ్రాంట్‌ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడతలో భాగంగా నగరానికి రూ.117 కోట్లు కేటాయించింది. గాలి స్వచ్ఛతను పెంచడంలో భాగంగా రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులతో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన సహాయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.