వ్యాక్సినేషన్‌పై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు.. వాటిపై ఫోకస్

న్యూఢిల్లీ : కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు.. స్టార్ హోటళ్లతో డీల్ చేసుకుని టీకా దందాకు తెరలేపాయి. ఈ ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని, వెంటనే వీటిని ఆపేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టీకా కేంద్రాల్లోనే పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. టీకా పంపిణీ మార్గదర్శకాల ప్రకారం, వ్యాక్సినేషన్ నాలుగు మార్గాల్లోనే జరగాలని […]

Update: 2021-05-29 20:21 GMT

న్యూఢిల్లీ : కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు.. స్టార్ హోటళ్లతో డీల్ చేసుకుని టీకా దందాకు తెరలేపాయి. ఈ ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని, వెంటనే వీటిని ఆపేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టీకా కేంద్రాల్లోనే పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. టీకా పంపిణీ మార్గదర్శకాల ప్రకారం, వ్యాక్సినేషన్ నాలుగు మార్గాల్లోనే జరగాలని పేర్కొంది.

అవి,

1. ప్రభుత్వ టీకా పంపిణీ కేంద్రాలు,
2. ప్రైవేటు హాస్పిటళ్లు నిర్వహించే ప్రైవేటు టీకా కేంద్రాలు,
3. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ హాస్పిటళ్లు, ప్రైవేటు కార్యాలయాల్లో ప్రైవేటు హాస్పిటళ్ల టీకా పంపిణీ,
4. 60ఏళ్లు దాటిన వృద్ధులు, భౌతిక, మానసిక వికలాంగులకు వారి నివాసాలకు సమీపంలో కమ్యూనిటీ సెంటర్లు, పంచాయతీ భవన్‌లు, పాఠశాల/కళాశాలలు, హౌజింగ్ సొసైటీలు, ఓల్డేజీ హోంలలో మాత్రమే టీకా పంపిణీ చేపట్టాలి.
ఇవి మినహా మరే వేదికపై టీకా పంపిణీ చేపట్టరాదని, స్టార్ హోటళ్లలో టీకా పంపిణీ గైడ్‌లైన్లకు విరుద్ధమని కేంద్ర హోం వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నానీ ఓ సర్క్యూలర్‌లో పేర్కొన్నారు.

 

Tags:    

Similar News