ఐదు నెలల చిన్నారి ప్రాణం.. ప్రధాని సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: అభం శుభం తెలియని ఐదునెలల చిన్నారి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతోంది. విదేశాల నుంచి తెప్పించాల్సిన మెడిసిన్ కోసం ఆ చిన్ని ప్రాణం ఆస్పత్రిలో ఎదురుచూస్తోంది. ఇంట్లో రోజంతా ఆడుతూ పాడుతూ కనిపించాల్సిన చిన్నారి.. అరుదైన వ్యాధితో బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులకు గుండె కోతను చూసి ఏకంగా ప్రధాని స్పందించారు. అంతేగాకుండా చిన్నారి కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన ఇటీవల ముంబై నగరంలో చోటుచేసుకుంది. సాక్షాత్తు పీఎం మోడీ మానవతాథృక్పథంతో స్పందించడంతో నెటిజన్లు […]
దిశ, వెబ్‌డెస్క్: అభం శుభం తెలియని ఐదునెలల చిన్నారి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతోంది. విదేశాల నుంచి తెప్పించాల్సిన మెడిసిన్ కోసం ఆ చిన్ని ప్రాణం ఆస్పత్రిలో ఎదురుచూస్తోంది. ఇంట్లో రోజంతా ఆడుతూ పాడుతూ కనిపించాల్సిన చిన్నారి.. అరుదైన వ్యాధితో బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులకు గుండె కోతను చూసి ఏకంగా ప్రధాని స్పందించారు. అంతేగాకుండా చిన్నారి కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన ఇటీవల ముంబై నగరంలో చోటుచేసుకుంది. సాక్షాత్తు పీఎం మోడీ మానవతాథృక్పథంతో స్పందించడంతో నెటిజన్లు ప్రధానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏంటా నిర్ణయమో చూద్దాం..
వివరాళ్లోకి వెళితే.. ముంబై నగరానికి చెందిన ప్రియాంక, మిహిర్‌లకు ఓ ఐదునెలల పాప తీరా కామత్ ఉంది. ఆ చిన్నారి వెన్నెముక కండరాల బలహీనతతో బాధపడుతోంది. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. స్పైనల్ మస్కుల్ర్ అట్రోఫి అరుదైన వ్యాధి సోకడంతో ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు నయం చేసేందుకు అవసరమయ్యే మెడిసిన్స్ భారత్‌లో దొరకవు, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని తల్లిదండ్రులకు తెలిపారు. అంతేగాకుండా ఆ మెడిసిన్ విలువ దాదాపు రూ.16 కోట్లు విలువ ఉంటుందని చెప్పడంతో గుండెపగిలినంద పనైంది. అంత డబ్బు ఎలా సెట్ చేయాలో తెలియక ఫండింగ్ మొదలు పెట్టారు. చిన్నారి బాధ విన్న అందరూ చలించిపోయి, విరాళాల జల్లు కురిపించారు. ఈ రకంగా ఏకంగా రూ.12 కోట్ల నిధులు సమకూరాయి. అయినా.. సరిపడా లేకపోవడం, అందులో జీఎస్టీ పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.
చివరకు ఈ విషయం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు తెలియడంతో మెడిసిన్స్ విషయంలో దిగుమతికి జీఎస్టీ రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్రం చిన్నారికి అవసరమైన ఔషదాల దిగుమతిపై సుంకాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల చిన్నారి ప్రాణాలు కాపాండేందుకు పెద్ద మనసుతో ముందుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి దేవేంద్ర ఫడ్నవీస్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నట్లు ట్వీట్టర్‌లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాప తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.