నాలాలో గల్లంతైన వ్యక్తి 11 రోజుల తర్వాత..

దిశ, కుత్బుల్లాపూర్ : పదిరోజుల క్రితం నాలాలో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహంగా లభ్యమయ్యాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ బాలరాజు వెల్లడించారు. కుత్బుల్లాపూర్ గ్రామంలోని గణేష్ టవర్స్‌కు చెందిన మోహన్ రెడ్డి(48) సెప్టెంబర్ 25న స్థానికంగా ఉన్న ఓ వైన్స్‌లో మద్యం తాగివస్తూ ప్రమాదవశాత్తు నాలాలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది డీఆర్ఎఫ్ బృందంతో వెతుకుతూనే ఉన్నారు. మంగళవారం ఐడీపీఎల్ […]

Update: 2021-10-05 08:47 GMT
Mohan Reddy
  • whatsapp icon

దిశ, కుత్బుల్లాపూర్ : పదిరోజుల క్రితం నాలాలో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహంగా లభ్యమయ్యాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ బాలరాజు వెల్లడించారు. కుత్బుల్లాపూర్ గ్రామంలోని గణేష్ టవర్స్‌కు చెందిన మోహన్ రెడ్డి(48) సెప్టెంబర్ 25న స్థానికంగా ఉన్న ఓ వైన్స్‌లో మద్యం తాగివస్తూ ప్రమాదవశాత్తు నాలాలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది డీఆర్ఎఫ్ బృందంతో వెతుకుతూనే ఉన్నారు. మంగళవారం ఐడీపీఎల్ కాలనీ నాలాలో మట్టిలో ఓ మృతదేహమున్నట్లు గుర్తించారు. పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండడంతో అతని వద్దనున్న ఐడీ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులు మోహన్ రెడ్డిగా గుర్తించారు. కాగా మోహన్ రెడ్డి మృతదేహం 11 రోజుల తర్వాత లభించింది.

Tags:    

Similar News