బీజేపీ సర్వామోదాన్ని గౌరవిస్తుంది: మోడీ

న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని నడిపేందుకు మెజార్టీ బలం సరిపోతుందని, కానీ, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరి ఆమోదమూ ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాజకీయ వెలిని బీజేపీ పాటించదని, ప్రజలూ ఆ జాఢ్యాన్ని తిరస్కరించారని చెప్పారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందని, కార్యకర్తలను ప్రోత్సహిస్తుందని వివరించారు. దేశ సేవ చేసేవారెవరైనా వారిని తప్పక గుర్తిస్తుందని, బీజేపీ విమర్శకులైనా, భిన్న భావజాలం కలిగిన వారైనా సమాజ సేవ చేసిన వారిని గౌరవిస్తుందని అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, […]

Update: 2021-02-11 06:46 GMT

న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని నడిపేందుకు మెజార్టీ బలం సరిపోతుందని, కానీ, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరి ఆమోదమూ ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాజకీయ వెలిని బీజేపీ పాటించదని, ప్రజలూ ఆ జాఢ్యాన్ని తిరస్కరించారని చెప్పారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందని, కార్యకర్తలను ప్రోత్సహిస్తుందని వివరించారు. దేశ సేవ చేసేవారెవరైనా వారిని తప్పక గుర్తిస్తుందని, బీజేపీ విమర్శకులైనా, భిన్న భావజాలం కలిగిన వారైనా సమాజ సేవ చేసిన వారిని గౌరవిస్తుందని అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ నేతలు తరుణ్ గొగోయ్, ఎస్‌సీ జమిర్‌లను తమ ప్రభుత్వం గౌరవించడానికి ఇదే కారణమని వివరించారు.

తమ భావజాలం దేశ భక్తితో మొదలవుతుందని, తమకు పార్టీ కన్నా దేశమే ప్రధానమని చెప్పారు. దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ శత జయంత్యుత్సవాలను పురస్కరించుకుని బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులపై ఎన్నికల్లో తీవ్రంగా పోరాడినప్పటికీ తర్వాత వారిని గౌరవిస్తుంటామని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు నిర్మాణాత్మక సందేశాలతో ప్రచారం చేయాలని, బీజేపీ ప్రభుత్వ పనితీరును ప్రజలు గుర్తిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

Tags:    

Similar News